స్మార్ట్‌ఫోన్ తయారీలోకి టీపీ లింక్

TP-Link Launched New SmartPhone

04:37 PM ON 9th January, 2016 By Mirchi Vilas

TP-Link Launched New SmartPhone

ప్రముఖ నెట్‌వర్కింగ్ వస్తువుల తయారీ సంస్థ టీపీ లింక్ స్మార్ట్‌ఫోన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు ఈ సంస్థ రూపొందించిన వైఫై, బ్లూటూత్ డివైజ్ లు అమిత ఆదరణ పొందాయి. దీంతో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల తయారీపై టీపీ లింక్ కన్నేసింది. సి5 సిరీస్ పేరిట 3 కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. నెఫ్ఫోస్ సీ5 మ్యాక్స్, నెఫ్ఫోస్ సీ5, నెఫ్ఫోస్ సీ5ఎల్ పేరిట ఈ ఫోన్లు త్వరలో వినియోగదారులకు లభ్యం కానున్నాయి. అయితే ఈ ఫోన్ల ధర, ఎప్పటి నుంచి లభ్యమవుతాయనే వివరాలను కంపెనీ త్వరలో వెల్లడించనుంది.

నెఫ్ఫోస్ సీ5 మ్యాక్స్ ఫీచర్లు ఇవే..

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080*1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ 64 బిట్ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఎస్డీ కార్డుతో 32 జీబీ వరకు పెంచుకునే అవకాశం, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ, మాలి టి720 ఎంపీ3 గ్రాఫిక్స్ యూనిట్, 3045 ఎంఏహెచ్ బ్యాటరీ.

నెఫ్ఫోస్ సీ5 ఫీచర్లు ఇవి..

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720*1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2200 ఎంఏహెచ్ బ్యాటరీ.

నెఫ్ఫోస్ సీ5 ఎల్ ఫీచర్లు ఎంటంటే..

4.5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 480*854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 జీహెచ్‌జడ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, అడ్రినో 304 జీపీయూ, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

English summary

Popular networking company TP-Link product manufacturer, following its announcement of its first smartphones ffos C5 Max, Neffos C5, Neffos C5L