ఫేస్ బుక్ దూకుడికి కళ్ళెం

TRAI Rejects Facebook Free Basics

05:45 PM ON 8th February, 2016 By Mirchi Vilas

TRAI Rejects Facebook Free Basics

భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) సోమవారం నెట్‌ న్యూట్రాలిటీ వైపే మొగ్గు చూపింది. ఒకే సమాచారానికి వేర్వేరు ధరలు నిర్ణయించడాన్ని నిషేధించింది. ఇక నుంచి ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే టెలికాం ఆపరేటర్లకు రోజుకు రూ.50,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. రిలయన్స్‌తో కలిసి ఫేస్‌బుక్‌ అందిస్తున్న ఫ్రీబేసిక్స్‌ను కొన్ని రోజులు క్రితం ట్రాయ్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో భారత్‌లో ఫేస్‌బుక్‌ కి చుక్కెదురైంది. ఇంకా చెప్పాలంటే, గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

వేర్వేరు ధరలు నిర్ణయించడం వలన సాధారణ కంటెంట్‌ ప్రొవైడర్లు, స్టార్టప్‌ సంస్థలు నష్టపోతాయని ట్రాయ్‌ అభిప్రాయ పడింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉచిత సేవలను టారిఫ్‌ పూర్తయ్యే వరకు వినియోగదారులు ఉపయోగించుకోవచ్చని పేర్కొంటూ, ఇక నుంచి వేర్వేరు ధరలు ప్రవేశపెట్టవద్దని సూచించింది. దీంతో ఇప్పుడు ఫేస్ బుక్ ఎలాంటి వ్యూహంతో వెళుతుందో చూడాలి.

English summary

Telecom Regulatory Authority of India (Trai) on Monday dealt a blow to Facebook's plans to offer free mobile Internet through its controversial Free Basics service, by outlawing differential pricing for data packages.