కదిలే రైలుకు సైతం కన్నం వేసారు ...6 కోట్లు దోచేశారు

Train Robbery Thieves Loot RBI Money From A Moving Train

11:22 AM ON 10th August, 2016 By Mirchi Vilas

Train Robbery Thieves Loot RBI Money From A Moving Train

రైలులో దొంగతనాలు కొత్తకాదు. కానీ ఈ దోపిడీ మాత్రం సినీ ఫక్కీలో సాగిపోయింది. దాదాపు 20 ఏళ్ల క్రితం తమిళంలో తిరుడా.. తిరుడా అనే ఒక సినిమా విడుదలైంది. అదే తెలుగులో దొంగ.. దొంగగా విడుదలైంది. ఆ సినిమాలో దొంగల్ని చూస్తే, ఓర్నీ ఎంత వీజీగా కన్నాలేస్తున్నారో అనిపిస్తుంది. రీల్ లైఫ్ లో కనిపించినంత ఈజీగా రియల్ లైఫ్ లో సాధ్యం కాదన్నట్లు, ఆ సినిమాలో సన్నివేశాలు ఉంటాయి. కానీ, తాజాగా చోటు చేసుకున్న ఉదంతం గురించిన వివరాలు వింటే, ఆ సినిమాలో సీన్లు కూడా ఎందుకు పనికిరావన్నట్లు తేలిపోవడం ఖాయం. ఇంతకీ విషయం ఏమంటే,

1/5 Pages

సంచలనంగా మారిన తాజా రైలు దోపిడీ వింటేనే ఉలిక్కిపడడం ఖాయం. తమిళనాడు రాష్ట్రంలోని సేలంలోని జాతీయ బ్యాంకు నుంచి సుమారు రూ.342 కోట్ల మొత్తాన్ని 226 బాక్సుల్లో సర్ది చెన్నైలోని రిజర్వు బ్యాంకుకు పంపుతున్నారు. భారీ భద్రత మధ్య ఈ ఎక్స్ ప్రెస్ రైలును తరలించారు. అనుకున్నట్లే చెన్నైకి చేరుకున్న ఈ ట్రైన్ లోని క్యాష్ బాక్సుల్ని ఓపెన్ చేస్తే కరెంటు షాక్ తగిలినంత పనైంది. ఎందుకంటే, ట్రైన్ పై కప్పు బాగంలో వెల్డింగ్ పరికరాలతో రంధ్రంచేసి ట్రైన్ లోకి ప్రవేశించి 6 కోట్ల రూపాయల వరకు డబ్బు కొట్టేసారు.

English summary

Train robbery thieves loot Rs 6 crore RBI money from a moving train in Tamil Nadu.