ఈ రైలెక్కితే మేఘాల్లో తేలినట్లుంటుంది(వీడియో)

Train to the Clouds in Argentina

06:25 PM ON 16th May, 2016 By Mirchi Vilas

Train to the Clouds in Argentina

రైలెక్కడం ఏంటీ? రైలెక్కితే మేఘాల్లో తేలిపోవడం ఏంటని అనుకుంటున్నారా? అలాగే అనిపిస్తుంది ఈ రైలెక్కితే.. అర్జెంటినాలోని సల్జా నగరం నుంచి లాపోల్వోరిల్లా అనే ప్రదేశానికి వెళ్ళే రైలు మిమ్మల్ని మెఘాల్లోకి తీసుకెళ్తుంది. సముద్ర మట్టానికి 4 వేల మీటర్ల ఎత్తుకు తీసుకు వెళ్ళే ఈ రైలును 'ట్రైన్ టు ద క్లౌడ్స్' అని పిలుస్తారు. ప్రపంచంలో ఎత్తైన రైలు మార్గం ఇదేనట! చూడచక్కని వంతెనలు గుహల మధ్యలో నుంచి ఈ రైలు దాదాపు 217 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 4200 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో మేఘాలు, స్వచ్చమైన గాలి చల్లటి వాతావరణం ఉంటుంది.

అంత ఎత్తులోకి వెళ్ళినప్పుడు ప్రయాణీకులు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతుంటారు. దీంతో ట్రైన్లో డాక్టర్లు, ఆక్సిజన్ కిట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. పర్యాటకులు అక్కడ దిగి కాసేపు మేఘాల ఉనికిని గాలిని చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. రవాణా కోసం నిర్మించిన ఈ రైలు మార్గం ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారి సందర్శకులకు ఆహ్లాదాన్ని అందజేస్తోంది. మీరు ఆ ప్రదేశం చూడాలంటే ఒక్కసారి ఈ వీడియో పై మీరు ఒక లుక్ వెయ్యండి..

English summary

Train to the Clouds in Argentina. A train to the clouds in Argentina. If we go in this train we will go to clouds.