ఎయిర్‌పోర్ట్‌లో మనిషి పుర్రెతో ప్రయాణికుడు

Traveller with man skull in airport

01:15 PM ON 7th April, 2016 By Mirchi Vilas

Traveller with man skull in airport

ఇటలీ రాజధాని అయిన రోమ్‌లో ఉన్న ప్రధాన ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఒక విచిత్ర సంఘటన సంభవించింది. అదేంటంటే రోమ్‌ నుంచి జర్మనీ వెళ్లడానికి ఓ ప్రయాణీకుడు రోమ్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నాడు. విమానంలో ప్రయాణించే ప్రయాణికుల బ్యాగ్‌లని అక్కడి అధికారులు ఎప్పటిలానే స్కాన్‌ చేశారు. అయితే ఆ స్కానింగ్‌లో ఆశ్చర్యం, భయం ఒక్కసారిగా చవి చూశాయి. అదేంటంటే ఆ ప్రయాణికుడు బ్యాగ్‌లో మనిషి పుర్రె ఉంది. దీనితో కంగారు పడ్డ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యి అతన్ని విచారించడం మొదలు పెట్టారు. ఆ విచారణలో ఆ ప్రయాణికుడు నేనొక ప్రొఫెసర్‌నని, పరిశోధన కోసం దీన్ని జర్మనీకి తీసుకెళ్తున్నట్లు తెలిపాడు.

ఇది కూడా చదవండి: ఫేస్ బుక్ లో ఎక్కువగా అబద్దాలు చెప్పేది ఎవరో తెలిసిపోయింది!

అంతే కాదు ఆ పుర్రెను రోమ్‌లోని ఓ బజారులో 50 యూరోలకు కొన్నానని తెలియజేసాడు. అయినా సరే పోలీసులు మాత్రం దానిని ఫోరెన్సిక్‌ పరీక్షలు కొరకు తరలించారు. ఆ విషయం తేలేంత వరకు అతన్ని ప్రయాణం చెయ్యడం ఆపేశారు. అతను చెప్పింది నిజమే అయినా స్కానింగ్‌ చేసినప్పుడు ఆ పుర్రె బయటపడి ఇబ్బంది అవుతుందని తెలిసినా కూడా ఎందుకిలా చేశాడో అని ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న మిగతా ప్రయాణికులు అనుకున్నారు.

ఇది కూడా చదవండి: 'బుల్లి సర్దార్' గా అఖీరా నందన్

English summary

Traveller with man skull in airport. A traveller went with a man skull in a bag to Rome international airport.