ట్రావెల్స్ బస్సు కాలిపోయింది.. 30 మందికి గాయాలు(వీడియో)

Travels bus caught fire in Prakasam district

03:50 PM ON 27th July, 2016 By Mirchi Vilas

Travels bus caught fire in Prakasam district

ఆమధ్య వరుసగా ట్రావెల్ బస్సులలో మంటలు చెలరేగి, పెద్ద ప్రమాదాలు చోటుచేసుకున్న సంగతి తెల్సిందే. ఈ మధ్య బానే ఉందిలే అనుకుంటే, తాజాగా జరిగిన ఘటన భయం గొల్పింది. వేగంగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం వీరేపల్లి దగ్గర ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఇలా పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ మియాపూర్ నుంచి చెన్నై వెళ్తున్న ఈ బస్సు లారీని ఢీ కొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. కొందరు ప్రయాణికులు బస్సు కిటికీ అద్దాలు పగుల గొట్టి బయటపడ్డారు.

డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

English summary

Travels bus caught fire in Prakasam district