చెట్టుకు స్థలం రాసి ఇచ్చేసాడు .. అక్కడ ఎం చేసారంటే ?

Tree Legal Ownership Of Itself

11:29 AM ON 19th September, 2016 By Mirchi Vilas

Tree Legal Ownership Of Itself

పర్యావరణం గురించి, కాలుష్య నివారణ గురించి , మొక్కల పెంపకం గురించి చాలామంది చాలానే చెబుతుంటారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా స్థలం ఇచ్చేసాడు. ఎవరైనా తన పేరుమీదున్న ఆస్తులను వారసులకు రాసిస్తుంటారు. కానీ, ఆ వ్యక్తి మాత్రం తన ఇంటి ముందున్న చెట్టుకు అది పెరిగే స్థలాన్ని దాని పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించాడు.

ఏథేన్స్ లోని డియరింగ్ అండ్ ఫిన్లీ స్ట్రీట్ లో 1942కి ముందు భారీ వృక్షం ఒకటి ఉండేది. దాని యజమాని విలియన్ హెచ్ .జాక్సన్ అనే వ్యక్తి ఆ చెట్టు పేరుమీదనే 8 అడుగుల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ స్థలంపై సర్వాధికారాలు ఆ చెట్టుకు ఉంటాయని రిజిస్ట్రేషన్ లో పేర్కొన్నాడు. దాంతో ఆ 8 అడుగుల స్థలం చట్టపరంగా ఆ చెట్టుకే చెందుతుంది.

అయితే ఆ చెట్టును స్థానిక పురపాలక సంస్థ సంరక్షించేది. అధికారులు దానికున్న హక్కులు, న్యాయపరమైన అధికారాలను రాసి ఉన్న బోర్డును ఆ చెట్టు వద్ద ఉంచారు. అయితే 1942లో వచ్చిన తుపాను దాటికి చెట్టు తట్టుకోలేకపోయింది. చెట్టు వయసు కూడా ఎక్కువగా ఉండటంతో నేలమట్టమైంది. జాక్సన్ కోరికను నెరవేర్చడానికి స్థానికులంతా కలిసి ఆ చెట్టు ఉన్న ప్రాంతంలోనే మరో మొక్కను నాటారు. ప్రస్తుతం అది భారీ వృక్షంగా ఎదిగి ఆ వీధి మొత్తానికి నీడనిస్తోంది. దాత ఆశయాన్ని కొనసాగిస్తున్న ప్రజలకు హేట్సాల్ఫ్ అంటున్నారు నెటిజన్లు.

ఇది కూడా చూడండి: దెయ్యాలున్నాయని కన్ఫర్మ్ అవ్వాలంటే ఈ ఓడల గురించి తెలుసుకోవాల్సిందే

ఇది కూడా చూడండి: మీరు ఎందులోనూ విజయం సాధించలేకపోతున్నారా? అయితే మీ ఇంట్లో ఇవి ఉన్నాయేమో చూడండి

English summary

Tree legal ownership of itself and of all land within eight feet of its base.