ఆ పోలీసులు రేపిస్టులు గా తేలారా?

Tribal Women Raped By Cops In Chhattisgarh

12:04 PM ON 9th January, 2017 By Mirchi Vilas

Tribal Women Raped By Cops In Chhattisgarh

కీచక పర్వం నడుస్తోందా అనిపించేలా వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా లైంగిక దాడులకు, అత్యాచారాలకు పాల్పడే వాళ్ళ జాగీతాలో చేరిపోతున్నారు. ఇక ఛత్తీస్ ఘడ్ లో రెండేళ్లలో 16మంది మహిళలపై పోలీసులు అత్యాచారాలకు పాల్పడటంతోపాలు లైంగిక దాడులు చేసినట్లు మానవహక్కుల కమిషన్ శనివారం విడుదల చేసిన నివేదకలో పేర్కొంది. ఈ మేరకు చత్తీస్ ఘడ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలన్నీ 2015, 2016లో చోటుచేసుకున్నాయి. మరో 20 మంది బాధితుల వాగ్మూలాలను నమోదు చేయాల్సి ఉందని.. దీనికి సంబంధించిన వాగ్మూలాలను నెలలోపు నమోదు చేయాలని అధికారులను హెచ్ ఆర్ సీ ఆదేశించింది.

వీరందరికి రూ.37లక్షల పరిహారం ఎందుకు ఇవ్వకూడదో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఎన్ హెచ్ ఆర్ స్సీ పేర్కొంది. అత్యాచారానికి గురైన వారికి రూ.3లక్షలు, లైంగిక వేధింపులకు గురైన వారికి రూ.2లక్షలు, భౌతిక దాడులకు గురైనవారికి రూ.50,000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఇటీవల చత్తీస్ ఘడ్ లో రాష్ట్ర పోలీసులు దాదాపు 40 మహిళను లైంగికంగా వేధించారని.. వీరిలో ఇద్దరిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారని వార్తలు వచ్చాయి. దీనిపై ఎన్ హెచ్ ఆర్సీ స్పందించి దర్యాప్తు ప్రారంభించింది.

English summary

Tribal Women Raped By Cops In Chhattisgarh