ఐఫోన్‌ స్పీడ్ ను ఇలా పెంచుకోండి..

Trick To Increase Iphone speed

04:58 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Trick To Increase Iphone speed

ఐఫోన్ ఎంతో ఇష్టపడి కొనుకున్న వారు చాలామందే ఉంటారు. కానీ ప్రతి ఏటా కొత్త కొత్త ఫోన్లు మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. ఐఫోన్ కూడా కొత్త వేరియంట్లను దించుతోంది. వీటితో పోలిస్తే పాత ఐఫోన్లు చాలా నెమ్మదిగా పనిచేస్తాయి. కానీ.. బోల్డు డబ్బులు పెట్టి.. ఎంతో ఇష్టపడి కొత్త ఫోన్ ను పక్కన పెట్టలేక.. అమ్మలేక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారు ఒక చిన్న చిట్కా పాటిస్తే తమ ఐఫోన్ వేగాన్ని పెంచుకోవచ్చంటున్నాడు అమెరికాకు చెందిన ఓ డెవలపర్. సాధారణంగా పాత ఐఫోన్‌లో ఐఓఎస్‌9 ఉంటే ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ఈ సమస్యను పరిశీలించిన జచరిడ్రైయెర్‌ అనే డెవలపర్‌ చిన్న చిట్కా చెప్పాడు. ఐఫోన్‌లో యాప్‌స్టోర్‌కు వెళ్లి క్యాచ్‌ మెమరీని శుభ్రం చేస్తే ఫోన్‌ వేగం పెరుగుతుందట. ఈ ప్రక్రియలో ఫోన్‌ తెర కొద్ది సమయం తెలుపు రంగులోకి మారుతుంది. మెయిన్‌ యాప్‌స్టోర్‌ పేజీ రీబూట్‌ అయిన తర్వాత మెమరీ క్లీన్‌ అవుతుంది. ఇంకేం మీ ఫోన్ కూడా ఇలా ట్రబుల్ ఇస్తుంటే వెంటనే ట్రై చేసేయండి.

English summary

Here is a trick to speed up your old iphone just we have to clear cache memory on our iphone. In this process our phone display may become white for sometime and it runs fast after that. This trick was dicovered by San Francisco developer Zachary Dryer