ఇద్దరి మధ్యా గొడవ ఏమిటబ్బా ?    

Trisha About The Clash With Nayanatara

01:38 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Trisha About The Clash With Nayanatara

సినిమా వాళ్ళు మనుషులేగా వీరి మధ్య కూడా గొడవలు సహజమేగా. మరి అందాల తారలు త్రిష - నయనతార మధ్య కూడా గొడవలున్నాయా... అందుకే నయనతో కల్సి నటించనని త్రిష చెప్పిందా? అసలు ఇద్దరి మధ్యా గొడవకు కారణం ఏమిటి? వంటి ప్రశ్నలు షికారు చేస్తున్నాయి. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ తో దూసుకుపోతున్న త్రిష ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే, 'అలాంటిదేమీ లేదే. మీడియా వాళ్లు కొందరు పని గట్టుకుని అలా ప్రచారం చేశారు. నిజంగా అలాంటిదేమైనా ఉంటే సోషల్ మీడియాలో నేనే పోస్ట్ చేసేదాన్ని కదా. ఉత్తి పుణ్యాన ఎందుకు ఇలాంటి ప్రచారం. నేను నయనతార మంచి స్నేహితులమే. సరైన కథ అమరితే ఇద్దరం కలిసి నటిస్తాం. ఇందులో అనుమానం లేదు' అని కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది. మరి నిప్పు లేందే పొగ రాదు కదా, ఇద్దరి నడుమా ఏదో జరిగే ఉంటుందని ఇండస్ట్రీలో టాక్.

English summary

Beautiful Heroine Trisha says about the news about the clash with heroine Nayanathara.Trisha confirms that there were no clashes between them and if there were any clashes she will defenitely post that issue over social media.Trisha says that Nayanathara was a good friend of her