ఆ మెడికోలను అనర్హులుగా ప్రకటించాలన్న త్రిష

Trisha angry on medical students

12:48 PM ON 8th July, 2016 By Mirchi Vilas

Trisha angry on medical students

చెన్నై చంద్రం త్రిషకు కోపం వచ్చింది. సినిమా వాళ్లపై కాదు, అభిమానులపై కాదు. మెడికోలు చేసిన పనిపై కోపం వచ్చింది. ఇంతకీ వాళ్ళు ఏం చేసారంటే, చెన్నైలో మేడపై నుంచి ఓ కుక్కను ఇద్దరు మెడికో లు విసిరేశారు. ఈ వ్యవహారంలో ఇద్దరు వైద్య విద్యార్థులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక, గాయపడిన ఆ కుక్క ప్రస్తుతం స్థానిక వెపేరిలోని వెటర్నరీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగా వుంది. అయితే జంతు ప్రేమగల నటి త్రిషకు కోపం వచ్చేసింది. అందుకే వాళ్ళను ఎంబీబీఎస్కు అనర్హులుగా ప్రకటించాలని త్రిష డిమాండ్ చేసింది. ట్విట్టర్ లో ఆమె ఈ మేరకు ట్వీట్ చేసింది.

కుక్కను కాపాడిన ముగ్గురు యువకులకు కృతజ్ఞతలు తెలిపారు. మూగజీవిపై నేరానికి పాల్పడిన మెడికోలను ఎంబీబీఎస్ చదివేందుకు అనర్హులుగా ప్రకటించాలని అంటోంది.

English summary

Trisha angry on medical students