ఎంఎల్ ఏ ని శపించిన త్రిష 

Trisha fires on MLA

11:33 AM ON 16th March, 2016 By Mirchi Vilas

Trisha fires on MLA

చెన్నై భామ త్రిషకు కోపం వచ్చింది. అంతే వెంటనే శపించేసింది. ఇంతకీ ఎవరిని అంటారా... అయితే వివరాల్లోకి వెళ్ళాల్సిందే. సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉండే త్రిష సమకాలీన పరిస్థితులపై తనదైన శైలిలో స్పందిస్తూ వుంటుంది. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే పోలీసు గుర్రంపై దాడి చేసినట్లు వస్తున్న ఆరోపణలపై త్రిష తీవ్రంగా స్పందించింది. ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్‌కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన తెలియజేయడంతో.. అసెంబ్లీ ముందు కొందరు ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా ఆందోళన కారులను అడ్డుకునే ప్రయత్నం చిసిన పోలీసులపై కొందరు బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు.

ఈ దాడిలో ఓ పోలీసు గుర్రం కాలికి దెబ్బతగిలి లేవలేని స్థితిలోకి పడిపోయింది. ఈ ఘటనపై చెన్నై చంద్రం త్రిష తీవ్రంగా స్పందిస్తూ, మూగజీవిపై దాడికి పాల్పడిన వ్యక్తికి నరకంలోనైనా శిక్ష పడాలని ప్రార్థిస్తూ...ఇది అందరూ సిగ్గు పడాల్సిన ఘటనంటూ ట్విట్ చేసింది. జంతు ప్రేమ పుట్టుకొచ్చిన త్రిష శాపం పెట్టిసింది.

English summary

Trisha fires on BJP MLA who beates horse brutally