'ధనుష్‌' కు విలన్‌ గా మారిన హీరోయిన్!!

Trisha is acting in a negative role in Dhanush movie

05:21 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Trisha is acting in a negative role in Dhanush movie

హీరోయిన్లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు వైవిధ్యమైన పాత్రలు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చెయ్యాలని అనుకోరు. గ్లామర్‌ పాత్రలలో నటించడానికే ఇష్టపడతారు. ఒకవేళ వైవిధ్యమైన పాత్రలలో అవకాశం వచ్చినా చెయ్యనని చెప్పేస్తారు. ఒకేసారి అవకాశాలు తగ్గిపోగానే వైవిధ్యమైన రోల్స్‌ చెయ్యడానికి ఆసక్తి చూపిస్తారు. అవకాశాలు తగ్గగానే వైవిధ్యమైన పాత్రలు చేస్తానంటూ ఎలాంటి పాత్రలో చెయ్యడానికైనా సిద్దపడతారు. చెన్నై బ్యూటీ త్రిష కూడా ఆ రూట్లోనే వెళ్తుంది. 'చీకటి రాజ్యం' సినిమాలో త్రిష అవతారం చూసిన ప్రేక్షకులు షాక్‌ తిన్నారు. త్రిష 'కళావతి' సినిమాలో దెయ్యంగా కనిపించనుంది.

ఇప్పుడు ధనుష్‌ హీరోగా నటించే సినిమాలో ఏకంగా విలన్‌ పాత్రలో నటించడానికి సిద్ధమైపోయింది త్రిష. ధనుష్‌ హీరోగా నటించే 'కోడి' సినిమాలో పూర్తిస్థాయి నెగిటీవ్ పాత్రలో పొలిటికల్‌ లీడర్‌గా కనిపించబోతుంది. ఈ చిత్రానికి 'దురై' దర్శకుడు. ఈ సినిమాలో త్రిషది పూర్తిగా విలన్‌ పాత్ర, అయితే ఈ పాత్ర తనకు చాలా నచ్చిందని, ఘాటింగ్‌ కోసం ఆత్రుత గా ఎదురు చూస్తున్నానని త్రిష చెప్తుంది.

English summary

Trisha is acting in a negative role in Dhanush 'Kodi' movie. Trisha is acting as a negative political leader role in this movie.