షాకింగ్ న్యూస్: తమిళనాడు సీఎంగా త్రిష!

Trisha is acting in Jayalalitha biopic

05:29 PM ON 31st October, 2016 By Mirchi Vilas

Trisha is acting in Jayalalitha biopic

ఇదేమిటని ఆశ్చర్య పోతున్నారా? టాలీవుడ్, కోలీవుడ్ లో తన కెరీర్ ని సాగించిన త్రిషకు ఈ మధ్య తన హవా తగ్గడంతో కొత్తదారులు వెతుకుతోంది. అందుకే ఎక్స్పెరిమెంటల్ మూవీలు చేయడానికైనా తాను రెడీ అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చేస్తోంది. పడిపోయిన తన కెరీర్ గ్రాఫ్ ను నిలబెట్టుకునే ప్లాన్ లోభాగంగా ముందూవెనుకా ఆలోచించకుండా దేనికైనా రెడీ అంటోందట. ఈ ప్రయత్నంలో త్రిష కాస్త ముందుకెళ్లి.. మేకర్స్ ఓకే అంటే తాను జయలలిత రోల్ చేయడానికైనా సిద్ధమేనన్న వార్త చెన్నైలో వైరల్ అయింది. తమిళ హీరో ధనుష్ తీసిన 'కోడి' మూవీ ప్రమోషన్ టూర్లో బిజీగావున్న ఈమె, తన మనులోని కోరికను బయట పెట్టిందట.

మహిళగా, రాజకీయవేత్తగా డిఫరెంట్ రోల్ చేసిన త్రిష.. తనకు అవకాశం వస్తే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లైఫ్ స్టోరీ ఆధారంగా ఎవరైనా సినిమా తీస్తే ఆమె క్యారెక్టర్ వస్తానంటూ ముందుగా ఇంట్స్ ఇచ్చేసింది. మరి జయలలిత బయోపిక్ తీసే ప్రయోగం ఏ డైరెక్టర్ చేస్తాడో? ఒకవేళ చేసినా త్రిషకు లీడ్ రోల్ ఇస్తాడో? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే..

English summary

Trisha is acting in Jayalalitha biopic