టీజర్‌ టాక్‌ : 'నాయకి' చాలా డేంజర్‌

Trisha Krishnan Nayaki movie teaser

11:29 AM ON 18th March, 2016 By Mirchi Vilas

Trisha Krishnan Nayaki movie teaser

త్రిష నటించిన తాజా చిత్రం 'నాయకి'. మొదటిసారిగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రంలో నటిస్తుంది త్రిష. ఈ చిత్రంలో త్రిషది ప్రత్యేక పాత్ర. గోవర్ధన్‌ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళంలో రూపొందుతుంది. ఈ దర్శకుడుకి ఇదే మొదటి సినిమా. గిరిధర్‌ మామిడిపల్లి, రాజ్‌ కందుకూరి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యం రాజేష్‌ కధానాయకుడిగా నటిస్తున్నాడు. 'నాయకి' ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని త్రిష పుట్టినరోజు నాడు రిలీజ్‌ చేసారు. ఇప్పుడు తాజాగా టీజర్‌ని విడుదల చేసారు.

వివరాల్లోకి వెలితే ఈ టీజర్‌ లో మొదట అందంగా క్యూట్‌గా ఎంతో సాఫ్ట్‌గా కనిపిస్తుంది త్రిష. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా సాఫ్ట్‌గా ఉంటుంది. సడన్‌ గా 12 గంటలు కొట్టడం, మ్యూజిక్‌ కాస్త మారిపోవటం, పాత్రలన్నీ దెయ్యాలరూపంలో కన్పించడం లాంటి అంశాలను చూస్తుంటే సినిమా చాలా థ్రిల్లింగ్‌ గా, భయంకరంగా ఉంటుంది అనిపిస్తుంది. ఇంక టీజర్‌ చివరిలో  చేతితో కట్టి పట్టుకొని నరుకుతుంటే త్రిషని చూస్తుంటే భయం వేస్తుంది,  త్రిష చాలా డేంజర్ గెట్ అప్ వేసినట్లు అర్ధమవుతుంది. ఈ టీజర్‌లో బ్యాక్‌ గ్రౌండ్‌ లో ఓ పాప గొంతు వినిపిస్తుంది అయితే ఆ పాపే దెయ్యమని, ఆ పాప కారణంగానే ఇంట్లో భయంకర పరిమాణాలు చోటుచేసుకుంటాయని తెలుస్తుంది. ఎలా అయితేనే త్రిష ఆడియన్స్‌ ని బాగానే భయ పెట్టింది ఈ టీజర్‌ తో.

1/6 Pages

టీజర్‌

నాయకి చిత్రం టీజర్‌ ప్రేక్షకులను అనుకున్న రీతి లోనే బయపెడుతుంది 

English summary

Trisha Latest Movie Nayaki teaser released.This movie was a horror comedy movie. Trisha first time acting lady oriented movie. Director Govardhan Reddy has done a terrific job. Raghu Kunche's Background Score deserves a special mention. Production Values were good.