మేనేజర్ చేతిలో ఘోరంగా మోసపోయిన త్రిష

Trisha manager cheated her

12:54 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Trisha manager cheated her

హీరోయిన్ త్రిష గురించి ఓ వార్త షికారు చేస్తోంది. నమ్మినవాళ్లే ఈమెను మోసం చేశారట. ఇంతకీ చెన్నై చంద్రంని మోసం చేసిందెవరు? ఎవరి ట్రాప్ లో పడింది? ఇది రీలా లేదా రియలా? వంటి విషయాలలోకి వెళ్తే.. ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. త్రిష నటించిన నాయకి హారర్ మూవీకి ప్రొడ్యూసర్ కూడా ఈ బ్యూటీ మేనేజర్ గిరిధర్ కావడం విశేషం. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘోరంగా బోల్తాపడింది. మూవీ వల్ల త్రిషకు ఒరిగిందేమీ లేదుగానీ, నష్టపోయిందే ఎక్కువని టాక్. ఇందులో నటించినందుకు త్రిష అస్సలు రెమ్యునరేషన్ తీసుకోలేదట.

అందుకు బదులు తమిళంలో రైట్స్ తనకు అప్పగించమని ప్రొడ్యూసర్ ని కోరిందట. ఇది తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్నామని, అదే టాలీవుడ్ లో అమ్ముకుంటే మంచి రేటు, ఆపై భారీగా లాభాలు వస్తాయని చెప్పి హీరోయిన్ కి కన్వీన్స్ చేయడం, ఆమె ఓకే చేయడం అంతా జరిగిపోయింది. తెలుగులో నాయకి చాలా తక్కువకి వెళ్లిందట.. అందులోనూ కొంత మొత్తాన్ని కూడా మేనేజర్ నొక్కేశాడట. తమిళంలో మంచి రేటుకే వెళ్లిందట. ఈ విషయం తెలిసి త్రిష బాగా అప్సెట్ అయ్యిందని అంటున్నారు. నమ్మకంతో ముందుకెళ్లిన తనని మేనేజర్ ముంచేశాడని క్లోజ్ ఫ్రెండ్స్ కి చెప్పిందట. ఇంకేముంది.. ఈ ఎపిసోడ్ తో బాగా ఫీలైన త్రిష, సదరు మేనేజర్ ను తొలగించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

English summary

Trisha manager cheated her