జనవరిలో త్రిష 'నాయకి'

trisha naayaki movie on january last week

02:54 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

trisha naayaki movie on january last week

రీసెంట్‌గా లోకనాయకుడు నటించిన చీకటి రాజ్యంలో కమల్‌తో డిష్యుం డిష్యుం చేసిన నటి త్రిష. తెలుగులో వర్షం చిత్రంలో స్టార్డమ్ సంపాదించుకుని ఆ తరువాత హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి పదమూడేళ్లు అవ్వుతున్నా ఇంకా సినీపరిశ్రమలో హీరోయిన్‌గా రాణించడమంటే ఆషామాషీ విషయం కాదు. త్రిష ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం 'నాయకి' లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందుతుంది. హర్రర్‌ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్‌ విడుదలయ్యాయి.

ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తుండడంతో ఘాటింగ్‌ను శరవేగంగా పూర్తిచేసి జనవరి నెలాఖర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్‌ జరుపుకుంటోంది.

English summary

trisha naayaki movie on january last week