అదే నా యవ్వన రహస్యం

Trisha Revealed Her Beauty Secret

12:56 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Trisha Revealed Her Beauty Secret

ఎల్లప్పుడూ 16 ఏళ్ళ పాపలా కనిపించాలని హీరోయిన్స్ అనుకోవడమే కాదు అందుకు తగ్గ జాగ్రత్తలు పాటిస్తుంటారు. అయితే తాము ఎందుకు యవ్వనంగా ఉన్నామో చెప్పడానికి మాత్రం వేనుకాడతారు. కానీ 13 ఏళ్ళ క్రితం ఇండస్ట్రీ కొచ్చి, ఓ ఊపు ఊపేసి, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి,మంచి ఫిజిక్ మెయింటేన్ చేస్తోన్న త్రిష తన సౌందర్య రహస్యం బహిర్గతం చేసింది. 'అన్నీ ఫుల్‌గా లాగించేస్తాను. ఆర్య చెప్పినట్లు రెండు ప్లేట్లు బిరియాని కూడా తినేస్తాను. అయితే ఎంత తిన్నానో కాలిక్యూలేట్ చేసుకుని, మరో అన్ని రోజులు తినడం మానేస్తాను. పళ్ల రసం మాత్రమే తీసుకుంటాను. ఇంతకు మించి రహస్యం అంటూ ఏమీలేదు' అని త్రిష చెప్పేస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అధిక చిత్రాలు చేయాలి, ప్రముఖ నటులతో నటించాలీ అని భావించాను. అయితే ఆ అనుభవం ఇప్పుడు మంచి కథాపాత్రల పై దృష్టి సారించాలని చెబుతోంది. ఇప్పుడు సెలెక్టెడ్ చిత్రాలే చేస్తూ రాశి గల నటిగా రాణిస్తున్నా' అని చెప్పుకొచ్చింది.

English summary

Actress Heroine Trisha revealed her beauty secret.One special thing about Trisha is that even entering into her 30’s, there was no much difference in her till date. She looks equally beautiful even after 15 years of her career.She says that she will drink fruit juices to maintain her fitness and her beauty