‘అ..ఆ’ ప్రీలుక్

Trivikram A Aa prelook

01:01 PM ON 12th March, 2016 By Mirchi Vilas

Trivikram A Aa prelook

అద్బుతమైన డైలాగ్‌లకు పెట్టింది పేరైన దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈసారి ‘అ..ఆ’ (అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి) అంటూ టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. యువ కథానాయకుడు నితిన్‌, సమంత జంటగా ‘అ..ఆ’ చిత్రాన్ని ఆయన రూపొందిస్తున్న నేపధ్యంలో ఈ చిత్ర ప్రీ లుక్ ను చిత్ర యూనిట్ శుక్రవారం ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

‘అ..ఆ’ ప్రీలుక్ ను చూస్తుంటే ఈ సినిమా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమాలా కనిపిస్తుంది. ఈ చిత్రం లో నితిన్ సరసన సమంత తో పాటు అనుపమ పరమేశ్వరన్ కుడా మరో హీరోయిన్ గా నటిస్తుంది.

ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం గర్వంగా వుందని, ఈ చిత్రం అందరికీ చక్కటి వినోదం అందిస్తుందని పేర్కొన్నారు . హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తుండగా . ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్‌ బాణీలు అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 6 న వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary

Tollywood Star Producer Trivikram was famous for his type of movies and Dialogues.Trivikram's upcoming film A..Aa.. pre look was released by the movie.Nithin and Samantha, Anupama Parameswaran were acted as hero heroines in this movie.This movie was going to be released on may 6th.