ఇప్పటికీ ఇంకా రెంట్‌ కడుతున్నాం

Trivikram And Sunil Pays Rent For Their First Room

06:41 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Trivikram And Sunil Pays Rent For Their First Room

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌-సునీల్‌ ఇద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. సినిమాల్లో ఛాన్స్‌ కోసం వీరిద్దరూ కలిసి ఒకేసారి భీమవరం నుండి హైదరాబాద్‌ రైలు ఎక్కారు. హైదరాబాద్‌లో ఇద్దరు కలిసి ఒకే రూమ్‌లో ఉండేవారు. ఎన్నో కష్టాల్ని దాటుకుని, కడుపుకి పస్తులుంచి ఎన్నో ప్రయత్నాలు చేసి ఇప్పుడీ స్థాయికి చేరారు. ఒకరు హీరోగా నిలదొక్కుకుంటే, మరొకరు డైరెక్టర్‌గా రాజ్యమేలుతున్నారు. అయితే ఎంత ఎత్తుకి ఎదిగినా మనం ఎక్కడ నుండి వచ్చామో మరువకూడదు అనే మాటను ఈ ఇద్దరు స్నేహితులు గుర్తు పెట్టుకున్నారు. అందుకే ఒకప్పుడు పంజాగుట్టలోని, సాయిబాబా గుడి దగ్గర వీరిద్దరూ కలిసి ఉన్న రూమ్‌కి ఇప్పటికీ రెంట్‌ కడుతున్నారట. ఆ రూమ్‌ వీరు అలానే ఉంచేశారట. ఆ రూమ్‌ యజమానిని అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి వెళ్ళి మాట్లాడి వస్తారట. తన స్నేహితుడు త్రివిక్రమ్‌ సునీల్‌కి 'బంతి' అనే కథని తన కోసం రాసుకున్నాడట. కానీ తీరిక దొరికాక కచ్చితంగా సునీల్‌ ఆ చిత్రంలో నటిస్తాడని సమాచారం.

English summary

Tollywood Top Director Trivikram Srinivas Says that he and Hero Sunil was came to hyderabad to become as film stars and they together lived in a room in Hyderabad .Trivikram says that he and sunil still pays rent for that room.