కంటికి కనిపించేవన్నీ నిజమా! కాదా!

Trivikram Movie Poster Morphed

02:57 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Trivikram Movie Poster Morphed

తెల్లనివన్నీ పాలు , నల్లనివన్నీ నీళ్ళు కాదు , కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు ... ఇలా రకరకాల నానుడి ఉండనే వుంది. అందులోని చేతికి అందివచ్చిన ఈ సాంకేతిక యుగంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలీని దుస్థితి ... ఏది ఒరిజనల్లో , ఏది డూప్లికేటో అంతుబట్టని వ్యవహారం గా మారింది. తాజాగా ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలు... ఒకటి తమిళ సినిమా ఐతే, మరొకటి తెలుగు సినిమా కి సంబంధించినవి. ‘ఇదు నమ్మ ఆలు’ కోలీవుడ్ మూవీలో శింబు సరసన ఆండ్రియా! సేమ్ పోస్టర్ తెలుగు ఫిల్మ్ ‘అ.. ఆ’లో నితిన్ - సమంత జంటగా దర్శనమిచ్చే పోస్టర్. ఈ స్టిల్ సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టడంతో చాలామంది సినీ లవర్స్ నమ్మేశారు. అయితే ఆరా తీస్తే, అసలు విషయం వెలుగు చూసింది. ఇది ఒరిజినల్ పోస్టర్ కాదని, మార్పింగేనని ఆ చిత్ర యూనిట్ అంటోంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు అఫీషియల్‌గా పోస్టర్ అంటూ ఏదీ రిలీజ్ చేయలేదట. ఎవరో కావాలని టెక్నాలజీని వినియోగించుకుని ఇలా చేశారని అంటున్నారు. ఏదైతేనేం.. అ.. ఆ కు పబ్లిసిటీ వచ్చిందని కూడా మరోపక్క వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నితిన్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్! హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ ఫిల్మ్‌కి డైరెక్టర్ త్రివిక్రమ్ అని తెలిసిందేగా.....

English summary

Director Trivikram Srinivas upcoming film was A..Aa...Young hero Nithin and Crazy heroine Samantha were acting in Lead roles in the movie.Recently in Social media the morphed photo of A..Aa...was going viral in Social media by palcing Tamil actors in that posters.The movie unit has opposed these photo by saying that it was morphed.