బన్నీ-నాగ్‌ లతో మల్టీస్టారర్‌ 

Trivikram Multistarrer Movie With Allu Arjun And Nagarjuna

12:57 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Trivikram Multistarrer Movie With Allu Arjun And Nagarjuna

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత బన్నీ 'మనం' ఫేమ్‌ విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే విక్రమ్‌ సూర్యతో తెరకెక్కించిన '24' చిత్రం పనులు పూర్తి కాకపోవడం వల్ల బన్నీతో చేసే చిత్రం కథను ఇంకా రెడీ చెయ్యలేదట. ఆ కథని తయ్యారు చెయ్యడానికి కనీసం 6 నెలలు పడుతుండడంతో ఈ లోపు బన్నీ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడట. ఇటీవలే త్రివిక్రమ్‌ వినిపించిన స్టోరీ లైన్‌ బన్నీకి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. అయితే ఇందులో మరో హీరోకి కూడా అవకాశం ఉండడంతో కింగ్‌ నాగార్జున ని సంప్రదిద్దామని బన్నీ చెప్పాడట. నాగార్జున ఓకే చెప్పే ఈ చిత్రం పట్టాలు ఎక్కుతుంది. ప్రస్తుతం నాగార్జున వంశీ పైడపల్లి దర్శకత్వంలో కార్తీతో 'ఊపిరి' అనే మల్టీస్టారర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

English summary

Stylish Star Allu Arjun an King Nagarjuna was decided to act in a Multistarrer film under the direction of Manam Fame Director Vikram K.Kumar.But presently Vikram was directing "24" movie with surya and Vikram does not make story ready.Allu Arjun was going to act in Trivikram direction after Sarainodu and All Arjun recommended Nagarjuna to another lead role in the movie.