పవన్ నిర్మాతగా రామ్ చరణ్-త్రివిక్రమ్ భారీ సినిమా!

Trivikram-Ram Charan movie is producing by Pawan Kalyan

04:41 PM ON 11th June, 2016 By Mirchi Vilas

Trivikram-Ram Charan movie is producing by Pawan Kalyan

అవును మీరు విన్నది నిజమే పవన్ కళ్యాణ్ నిర్మాతగా రామ్చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమా ప్రపోజల్స్ వచ్చిన తీరు చూస్తే పవన్, చరణ్ ల మధ్య ఉన్న బంధం పై ఇంకా క్లారిటీ వస్తుంది కూడా. అ..ఆ.. హిట్తో ఊపు మీదున్న త్రివిక్రమ్ చేతిలో రెండు కథలు ఉన్నాయట. ఆ రెండిటినీ పవన్ కి వినిపించారు త్రివిక్రమ్. ఆ రెండూ కథలూ పవన్ కి తెగ నచ్చేశాయట. అయితే రెండింటిలో ఒక దానిలో రామ్ చరణ్, రెండవ దానిలో తాను నటిస్తే బావుంటుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయమట. అందుకే, ఈ రెండు కథలనూ రాంచరణ్ కి చెప్పమని త్రివిక్రమ్ ని పవన్ కోరాడు.

తనకెలాగో రెండు కథలూ నచ్చాయి కాబట్టి, వాటిలో రామ్ చరణ్ కి ఏది నచ్చితే ఆ కథను తాను ప్రొడ్యూస్ చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సమాచారం. డేట్స్ ని బట్టి రెండో స్టోరీతో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమా చేస్తారు. తాను నిర్మాతగా చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తానని చాలా కాలం క్రితమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పుడా అది కుదిరింది.
ఇప్పుడు త్రివిక్రమ్ రామ్ చరణ్ ని కలసి కథ చెప్పిన తరువాత రామ్ చరణ్ కి కథ నచ్చితే అప్పుడు మిగిలిన వ్యవహారం నడుస్తుంది. చరణ్ ఇప్పటికే ధృవ చేస్తున్నాడు. చిరంజీవి 150వ సినిమా నిర్మాత కూడా చరణే.

మరి డేట్స్ కుదిరి చరణ్ ఈ సినిమా ఎప్పుడు చేస్తాడో, అసలు కథ నచ్చుతుందో లేదో కూడా తేలాల్సి ఉంది. ఒకవేళ చరణ్ సినిమా చేయడం ఆలస్యం అయినా, ఆ రెండిటిలో ఒక కథ ఎంచుకుంటే, మిగిలిన కథతో పవన్ సినిమా పట్టాలెక్కే అవకాశం కూడా ఉంది.

English summary

Trivikram-Ram Charan movie is producing by Pawan Kalyan