మోక్షజ్ఞతో త్రివిక్రమ్ మాయాజాలం

Trivikram Srinivas directing Nandamuri Mokshagna debut film

10:54 AM ON 30th July, 2016 By Mirchi Vilas

Trivikram Srinivas directing Nandamuri Mokshagna debut film

పదునైన, పంచ్ డైలాగులకు పెట్టింది పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకునిగా తన సత్తా చాటుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఏ హీరోతో సెట్స్ పైకి వెళ్తున్నాడు? ఇప్పటివరకు మెగా హీరోలతో మూడు ప్రాజెక్టులు చేశాడు. అవన్నీ బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి. ఆగస్టు నుంచి డాలీతో పవన్ కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టే పనిలో పడ్డాడు. ఇక అల్లుఅర్జున్.. మరో డైరెక్టర్ తో ప్లాన్ చేస్తున్నాడు. ఇక మెగా హీరోలతో చేయాలంటే ఎలాగలేదన్నా దాదాపు ఆరునెలలు టైమ్ పడుతుంది. ఈలోగా యంగ్ హీరోతో ఓ సినిమా ఫినిష్ చేయాలని భావిస్తున్నాడట. ఈ క్రమంలో నందమూరి క్యాంప్ కి ఆయన అడుగు పెడుతున్నట్టు టాక్ వస్తోంది. ఇంతకీ ఎవరితో ప్లాన్ చేస్తున్నాడు? అంటే ఖంగు తినాల్సిందే.

బాలయ్య కొడుకు మోక్షజ్ఞతో ఫిల్మ్ చేసేందుకు త్రివిక్రమ్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. గతంలో ఇలాంటి వార్త చక్కర్లు కొట్టింది. కాకపోతే శాతకర్ణి మూవీలో ఓ వైపు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే, మరోవైపు నటనలో నట వారసుడు మెలకువలు నేర్చుకుంటున్నాడట. ఈ నేపథ్యంలో మాటల మాంత్రికుడితో అయితే బెటర్ అని నందమూరి క్యాంప్ ఆలోచన చేయడం, అందుకు త్రివిక్రమ్ కూడా ఓకే చేయడం అంతా జరిగిపోయిందని అంటున్నారు. ఇదిలావుండగా బాలయ్య కొడుకుతో మూవీ చేసే ఛాన్స్ కొరటాల శివకు వుందని అంటున్నారు. జనతా గ్యారేజ్ హిట్టయితే మోక్షజ్ఞతో ఆయన కూడా చేయవచ్చని కూడా అంటున్నారు. ఇక మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న బోయపాటిని కొద్దిరోజులు వెయింటిగ్ లో వుంచాలని అనుకుంటున్నాడట.

మొత్తానికి ఈ ఏడాది బాలయ్య నటవారసుడు సెట్స్ పైకి వెళ్లడం నూటికి నూరుపాళ్లు ఖాయమని అంటున్నారు. మొత్తానికి నందమూరి ఫ్యామిలీతో తొలిసారి త్రివిక్రమ్ సినిమా ఉంటుందంటే దాని క్రేజ్ హై పిచ్ లో ఉంటుంది.

English summary

Trivikram Srinivas directing Nandamuri Mokshagna debut film