త్రివిక్రమ్ భార్యను చూశారా?

Trivikram Srinivas with his wife

04:00 PM ON 11th April, 2016 By Mirchi Vilas

Trivikram Srinivas with his wife

తన పదునైన మాటలతో, అర్ధవంతమైన డైలాగ్స్ తో మాటల మాంత్రికుడు గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లేశ్వరి, నువ్వే కావాలి వంటి చిత్రాలకు కథ-మాటలు అందించిన త్రివిక్రమ్ ఆ తరువాత 'నువ్వే నువ్వే' చిత్రంతో దర్శకుడిగా మారాడు. మాట‌ల మాంత్రికుడిగా ఇండ‌స్ర్టీలో పాపుల‌ర్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ హిట్ల‌ను ఆయ‌న సొంతం చేసుకున్నారు. తక్కువ సమయంలోనే మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో సినిమా లు తీసే రేంజ్ కి త్రివిక్రమ్ ఎదిగాడు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కాళ్ల‌కు చెందిన త్రివిక్ర‌మ్ అసలు పేరు ఆకెళ్ల శ్రీనివాస్, దానిని త్రివిక్రమ్ శ్రీనివాస్ గా మార్చుకున్నాడు.

కమీడియన్ కమ్ హీరో సునీల్‌కు త్రివిక్రమ్ రూమ్మెట్ అన్న విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కానీ.. ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ అందరికీ తెలిసింది చాలా తక్కువ. ఆయన ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి తమ్ముడి కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆయన సతీమణి(సౌజన్య శ్రీనివాస్) ఎక్కడా కనిపించలేదు. అయితే తాజాగా త్రివిక్రమ్ ఆయన భార్యతో కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ ముచ్చటగా కలిసి ఉన్న ఆ ఫోటో ను మీరు కూడా ఒకసారి వీక్షించండి.

1/4 Pages

భార్యతో త్రివిక్రమ్:

భార్య సౌజన్య శ్రీనివాస్ తో త్రివిక్రమ్.

English summary

Trivikram Srinivas with his wife. Director Trivikram Srinivas with his wife Soujanya Srinivas and children.