పవన్‌ పై టిఆర్‌ఎస్‌  ఫైర్‌

TRS leader fires on pawan

12:52 PM ON 7th January, 2016 By Mirchi Vilas

TRS leader fires on pawan

టిఆర్‌ఎస్‌ లీడర్‌ ఎస్సీ కార్పోరేషన్‌ చైర్మెన్‌ పిడమర్తి రవి పవన్‌కళ్యాణ్‌ పై తీవ్ర విమర్శలు చేసాడు. పవన్‌కళ్యాణ్‌ ది పవనిజం కాదని, బ్రోకరిజమని ఇలా బ్రోకరిజం చేస్తున్న పవన్‌కళ్యాణ్‌ ని తరిమి కొడతారని విమర్శలు చేసాడు. హైదరాబాద్‌ లోని గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా పిడమర్తి రవి మాట్లాడుతూ, పవన్‌కళ్యాణ్‌ ప్రజల సమస్యలపై ఏనాడు పోరాడలేదని, ఎన్నికల టైమ్‌లో మాత్రం ప్రజలను మభ్యపెట్టడానికి వస్తుంటాడని చెప్పుకొచ్చాడు. గ్రేటర్‌ లో ఎన్నికలు ప్రచారం నిర్వహిస్తే ఇక్కడి ప్రజలు పవన్‌ని తరిమి కొట్టడం గ్యారెంటీ అని తీవ్రంగా విమర్శించాడు.

English summary

TRS leader fires on pawan