గ్రేటర్ ప్రణాళిక విడుదల చేసిన టిఆర్ఎస్

TRS Manifesto For GHMC Elections

11:48 AM ON 23rd January, 2016 By Mirchi Vilas

TRS Manifesto For GHMC Elections

గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో ప్రచార ఘట్టానికి తెరలేవడంతో ఒక్కో పార్టీ తాము చేయబోయే కార్యక్రమాలను చెప్పబోతున్నాయి. అన్నింటా ముందుంటూ వస్తున్నా టిఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక లో కూడా అదే తీరు కనబరిచింది. శనివారం తెరాస భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్రమంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, సీనియర్‌ నేతలు కె.కేశవరావు, డి.శ్రీనివాస్‌, బాల్కా సుమన్‌ తదితరులు ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తూ ప్రణాళికను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అమలు చేయగలిగే హామీలనే ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచామని తెలిపారు. గతంలో లేని విధంగా సామాజిక సమతూకంతో అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు.ఈ నెల 30వ తేదీన నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారని వివరించారు.రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు మాట్లాడుతూ నూతన శకానికి నాంది పలికేలా అజెండా విడుదల చేశామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పించినట్లు తెల్పారు. మానిఫెస్టో విడుదల చేయడంతో టిఆర్ఎస్ ఇక ప్రచార పర్వానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.

English summary

Telangana Rasthtra Samiti (TRS) party have released the manifesto and the Plan which is going to be follow in GHMC elections