గ్రేటర్లో గులాబి వ్యూహం ఫలించేనా ?    

TRS Strategy In GHMC Elections

10:55 AM ON 4th January, 2016 By Mirchi Vilas

TRS Strategy In GHMC Elections

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకోసం టిఆర్ఎస్ అధినేత , తెలంగాణా సిఎమ్ కెసిఆర్ తన వ్యూహానికి పదును పెట్టారు. ఈనెల లోనే ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలు రావడంతో కెసిఆర్ అందుకనుగుణంగా పావులు కదుపుతుంటే , సహజంగానే విపక్షాలు పాత వాటిని ప్రస్తావిస్తూ కెసిఆర్ నైజాన్ని బయట పెట్టె యత్నం చేస్తున్నారు. తెలంగాణా వాళ్ళు , సెటిలర్లు ఒకటేనని కెసిఆర్ జపిస్తూ , సెటిలర్ల మనసు దోచుకునే ప్రయత్నం చేస్తుంటే , గతంలో సీమాంధ్రుల గురించి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను విపక్షాలు గుర్తుచేస్తూ , టిఆర్ఎస్ ని దెబ్బ తీయాలని చూస్తున్నాయి.

ఇప్పటికే కెసిఆర్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే గ్రేటర్ ఎన్నికల లో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. నెలాఖర్లోగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్ సోర్సింగ్ జీతాలు పెంపు, రాజధానిలో ఆస్తి పన్నుకు పాక్షిక మినహాయింపు (రూ.1200 చెల్లించే వారు రూ.101 చెల్లిస్తే చాలు), నిరుపేదల నీటి, విద్యుత్ బకాయిలు రద్దు, క్షౌరశాలలు వాడే కరెంట్ డొమెస్టిక్ పరిధిలోకి తీసుకు రావడం, డిఎస్సీ పోస్టులు, రిజర్వాయర్లు ఇవన్నీ గ్రేటర్ ఎన్నికల దృష్ట్యానే ప్రకటించారనడం లో సందేహం లేదని పలువురు అంటున్నారు. ఇలాంటివన్నీ విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా , టిఆర్ఎస్ ఎన్నికల ఎత్తుగడ చిత్తుచేయాలని విపక్షాలు పనిలో పడ్డాయి.

ఇక టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం లేదని ఆయన అంటూ , ప్రభుత్వం పథకాలు అద్భుతంగా ఉన్నాయ ని ఆయన పేర్కొంటూ, వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి , పాజిటివ్ వాతావరణం తీసుకు రావాలని సూచించారు. గ్రేటర్లో గెలిచి తీరాల ని ఆయన స్పష్టం చేస్తూ , అప్పుడే హైదరాబాదును విశ్వనగరంగా చేయగలమన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో 150 డివిజన్ల బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించ డంతో పాటూ అసెంబ్లీ నియోజకవర్గాలకు మంత్రుల ను ఇంచార్జి లుగా వేసారు.

గ్రేటర్ ఎన్నికలు ఖాయంగా ఉన్నందున అప్పుడే అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సీమాంధ్రల పైన తీవ్ర విమర్శలు చేసిన తెరాస నేతలు కూడా ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సాఫ్టుగా వ్యవహ రిస్తుంటే, తెలంగాణ ఏర్పాటుకు ముందు సీమాంధ్రుల పైన ఇష్టారీతిగా మాట్లాడిన టిఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రేమ కురిపిస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అందరి చూపు ప్రధానంగా 'సెటిలర్స్' పై పడింది. సేటిలర్లె కీలకం కాబోతున్నారు కూడా. మరి టి ఆర్ ఎస్ వ్యూహం ఫలిస్తుందా ? విపక్షాలు అడ్డుకట్ట వేస్తాయా అనేది చూడాలి.

English summary

Telangana Rashtra Samiti (TRS) is ready to face Greater Hyderabad Municipal Corporation(GHMC) Elections. TRS party was moving forward with their strategy to face opposition in GHMC elections.