ఖేడ్‌ ఉపఎన్నికలో దూసుకుపోతున్న టిఆర్ఎస్

TRS To Win In NarayanKhed By Elections

10:19 AM ON 16th February, 2016 By Mirchi Vilas

TRS To Win In NarayanKhed By Elections

మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు లో టిఆర్ఎస్ దూసుకెళుతోంది. వరుస విజయాలతో జోష్ మీదున్న గులాబి దళానికి ఖేడ్ ఉప ఎన్నిక కూడా విజయాన్ని తెచ్చిపెట్టనుంది. కారు స్పీడ్ కి ఎవరూ ఆగడం లేదు.నారాయణఖేడ్‌ మండలం జూకల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో కొనసాగుతోన్న ఉప ఎన్నిక లెక్కింపు లో ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి టిఆర్ఎస్ అభ్యర్థి ఎం. భూపాల్‌రెడ్డి 11,565 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 6వ రౌండ్ లో కూడా ఆధిక్యం కొనసాగుతోంది. మరో 9 రౌండ్లలో ఓట్లలెక్కింపు జరగాల్సి ఉంది. ఈనెల 13న నిర్వహించిన పోలింగ్‌లో నియోజకవర్గంలోని మొత్తం 1,88,373 ఓటర్లకు గాను 1,54,866 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 137 మంది సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12గంటల లోగా ఫలితం వెల్లడయ్యే అవకాశముంది.

మొదటి రౌండ్‌: టిఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డికి 3,922 ఓట్లురాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి సంజీవరెడ్డికి 1970, టిడిపి అభ్యర్థి విజయపాల్‌రెడ్డికి 701 ఓట్లు లభించాయి. తొలి రౌండ్‌ పూర్తయ్యే సరికి టిఆర్ఎస్ అభ్యర్థి 1952 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్‌లో నోటాకు 48 ఓట్లు పోలయ్యాయి.ఇక రెండో రౌండ్‌:లో కూడా టిఆర్ఎస్ అభ్యర్థికి 3,990, కాంగ్రెస్‌ అభ్యర్థికి 1987, టిడిపి అభ్యర్థికి 832 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 39 ఓట్లు లభించాయి. రెండో రౌండ్‌ పూర్తయ్యే సరికి టిఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి 3,995 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మూడో రౌండ్‌: టిఆర్ఎస్ అభ్యర్థికి 4,730, కాంగ్రెస్‌ 1,383,టిడిపి 1,608, నోటాకు 53 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్‌ పూర్తయ్యే సరికి టి ఆర్ ఎస్ అభ్యర్థి 7,702 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

నాలుగో రౌండ్‌: తెరాస అభ్యర్థికి 4,635, కాంగ్రెస్‌ 2,275, తెదేపా 7112, నోటాకు 26 ఓట్లు పోలయ్యాయి. నాలుగు రౌండ్లలో టిఆర్ఎస్ అభ్యర్థి 9,662 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఐదో రౌండ్‌: లో టి ఆర్ ఎస్ 4,387, కాంగ్రెస్‌ 2,484, టి డిపి 1,043, నోటా 46 ఓట్లు పోలయ్యాయి. తొలి రౌండ్ నుంచీ ఆధిక్యం ప్రదర్శిస్తున్న టిఆర్ఎస్ కి నారాయణ ఖేడ్ విజయం ఖాయమని దాదాపు తేలిపోవడంతో గులాబీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

English summary

Telangana Rastra Samiti (TRS) was in lead in Narayankhed by elections in Medak District in Telangana State.TRS party candidate M.Bhupal Reddy was in lead with 11,565 votes after five rounds of counting rpocess