గ్రేటర్ లో గులాబి గుబాళింపు ఉంటుందా ?

TRS Winning Chances GHMC Elections.?

06:14 PM ON 21st December, 2015 By Mirchi Vilas

TRS Winning Chances GHMC Elections.?

వరంగల్ ఉప ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం తో పాటూ, స్థానిక సంస్థల ఎంఎల్సి ఎన్నికల్లో సైతం ఇప్పటికే 6 ష్టానాలు కైవసం చేసుకున్న టిఆర్ఎస్ మిగిలిన చోట్ల కూడా సత్తా చాటేందుకు ఎత్తులు వేస్తుంది. మరోపక్క గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ప్రాభవం చాటేందుకు అవసరమైన కసరత్తు మొదలు పెట్టింది.

ఇప్పటికే ఇతర పార్టీల నేతలకు , ద్వితీయ శ్రేణి నాయకులకు వల విసురుతున్న టిఆర్ఎస్ చాలామందిని పార్టీ గొడుగు కిందకు తెచ్చారు. ఇక సెటిలర్స్ కూడా టిఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశం వుందని బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో సెటిలర్స్ జై సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సమర్ధించినా , ఇన్నాళ్ళు టిడిపి , బిజెపి , కాంగ్రెస్ లను బలపరుస్తూ వస్తున్నా, ప్రస్తుతం మారుతున్న పరిణామాలను గమనిస్తున్న సెటిలర్స్ తమ దృక్పధాన్ని కూడా మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన పార్టీలు ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నా, ఇతర పార్టీల నేతలే టి ఆర్ ఎస్ లోకి పోతున్నప్పుడు , వారిని నమ్ముకోకుండా, ఇతరుల పట్ల మొగ్గి , అనవసరంగా తగాదా తెచ్చ్హుకోవడం ఎందుకన్నా భావన సెటిలర్స్ లో కనిపిస్తోందని అంటున్నారు.

ఇక జనవరి లో జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో కార్యకర్తలను సమాయత్తం చేసే పని కూడా టిఆర్ఎస్ శ్రేణులు ఆరంభించారు. సిఎమ్ కెసిఆర్ కుమారుడు. పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి ఇదే పనిలో వున్నారు. ఇందులో భాగంగా సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో కేఎం ప్రతాప్, కట్టెల శ్రీనివాస్ యాదవ్, వీఎన్ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి కె టి ఆర్ సాదరంగా ఆహ్వానించారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని టిఆర్‌ఎస్ నేతలకు, కార్యకర్తలకు కెటిఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని నమ్మి కాంగ్రెస్ నేతలు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. టిఆర్‌ఎస్‌లోకి వలసలు ఇంకా కొనసాగుతాయన్నారు.

60 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో చేసిందేమి లేదని మండిపడ్డారు. తాము 18 నెలల్లో ఏం చేశామో ప్రజలకు చెప్పగలమని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని, గ్రేటర్‌లో టిఆర్‌ఎస్‌ను గెలిపించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌కు గతంలో ఏం చేశారో కాంగ్రెస్, టిడిపి నేతలను నిలదీయండని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. టిఆర్ఎస్ నేత డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరి టిఆర్ఎస్ వ్యూహం ఫలించి , గ్రేటర్ లో గులాబి గుబాళింపు ఉంటుందో , కారుకు బ్రేకులు పడతాయో , సైకిల్ - కమలం జోడీ కల్సి వస్తోందో, హస్తం అంచనాలు అందలం ఎక్కిస్తాయో , జనసేన ఊపు కనిపిస్తోందో , ఎంఐఎం జోరు ఎలా వుంటుందో వేచి చూడాలి.

English summary

Recently TRS won in 6 Seats MLC elections .Now its turn to Look On Greater Hyderabad Municipal Corporation Elections. Will TRS party to win or defeat lets wait and see till the election results