కొనసాగిన టిఅర్ఎస్ హవా- నల్గొండలో కారుకి బ్రేకులు .....

TRS Wins Four Of Six MLC Seats In Telangana

01:06 PM ON 30th December, 2015 By Mirchi Vilas

TRS Wins Four Of  Six MLC Seats In Telangana

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎంఎల్సి ఎన్నికల్లో ఆరు చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికైన టిఆర్ఎస్ , నాలుగు జిల్లాల్లో మరో ఆరు చోట్ల జరిగిన ఎన్నికల్లో బుధవారం ఓట్ల లెక్కింపు నిర్వహించగా, నాలుగు సీట్లు గెల్చుకుని, తన హవా సాగించింది. అయితే రెండు చోట్ల చతికిల బడడంతో ఆ రెండు సీట్లు కాంగ్రెస్ గెలిచింది. దీంతో టిఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో ఆపార్టీ సంబరాలు చేసుకుంటుంటే , రెండుచోట్ల గెలిచిన కాంగ్రెస్ కూడా సంబరాల్లో మునిగి తేలుతోంది.

కోమటి రెడ్డి బ్రదర్స్ అంచనాలు నిజమయ్యాయి....

నల్గొండకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు పరాభవం తప్పలేదు. క్లీన్ స్వీప్ చేయాలన్న కేసీఆర్ లక్ష్యాన్ని గండికొడుతూ.. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నపరెడ్డిని 158 ఓట్ల మెజార్టీతో ఓడించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గులాబీ బాస్ కు షాకిచ్చారు. . నల్గొండ ఎమ్మెల్సీ స్థానాన్ని కోమటిరెడ్డి కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

స్థానిక సంస్థల్లో మెజార్టీ బలం ఉన్న కాంగ్రెస్ మొదటి నుంచి గెలుపు మీద ధీమాతో ఉంది. అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో, దీనికి తగ్గట్లే కోమటిరెడ్డి ఫ్యామిలీకి షాక్ ఇవ్వాలని.. నల్గొండలో వారి అధిపత్యానికి గండి కొట్టాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ అధికారపక్షం చాలానే ప్రయత్నాల్ని చేసింది. మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి సీరియస్ గా స్పందిస్తూ , నల్గొండలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని , గెలవని పక్షంలో రాజీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు కూడా. టిఆర్ఎస్ ఊహలకు దీనికి భిన్నంగా ఇక్కడ ఫలితంవచ్చింది. కారుకి బ్రేకులు పడ్డాయి. కోమటి రెడ్డి బ్రదర్స్ అంచనాలు నిజమయ్యాయి. 2019లో కాంగ్రెస్ దే విజయమని కోమటిరెడ్డి వెంకట రెడ్డి ధీమా వ్యక్తం చేసారు.

మహబూబ్ నగర్ లో చేరోటీ ....

మహబూబ్ నగర్లో పోటాపోటీ మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ మొదటి స్థానంలో తెరాస అభ్యర్థి గెలిచారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి 65 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మహబూబ్ నగర్ రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కూచికళ్ళ దామోదర్ రెడ్డి విజయం సాధించారు.

ఖమ్మం బాలసానిదే .....

ఖమ్మంలో టిఆర్ఎస్ గెలుపు ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి విజయం సాధించారు. టిఆర్ఎస్ అభ్యర్థి బాలసాని 31 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పలుగుబడి బానే పనిచేసింది. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసే తమను గెలిపించారని ఖమ్మం నుంచి గెలిచిన బాలసాని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు.

రంగారెడ్డి లో రెండూ టిఆర్ఎస్ వే.....

రంగారెడ్డి జిల్లాలో తెరాస ముందంజ లో నడిచింది. ఈ జిల్లాలో రెండు స్థానాలలోను టిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. శంభీపూర్ రాజా, నరేందర్ రెడ్డిలు విజయం సాధించారు. టిఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగితేలారు.

English summary

TRS Wins Four Of Six MLC Seats In Telangana