నిన్న 'నాన్నకు ప్రేమతో' -  నేడు మామకు బర్త్ డే గిఫ్ట్ 

TRS won In Narayankhed Elections

01:32 PM ON 16th February, 2016 By Mirchi Vilas

TRS won In Narayankhed Elections

*నారాయణ్ ఖేడ్ లో టీఆర్ఎస్ ఘన విజయం
*టీడీపీ డిపాజిట్ గల్లంతు ....
*ప్రతి రౌండ్ లో దూసుకుపోయిన కారు ...
*గులాబి శ్రేణుల్లో నూతనోత్సాహం ....
*ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పిన హరీష్ ..

తెలంగాణ సీఎం - టీఆరెస్ అధినేత కేసీఆర్ వ్యూహానికి తిరుగేలేదు అన్నట్టుగా నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో గులాబి గెలుపు మరోసారి నిరూపించింది. నిన్న గాక మొన్న గ్రేటర్ ఎన్నికల్లో కొడుకు , మంత్రి కెటిఆర్ కి బాధ్యతలు అప్పగిస్తే , 'నాన్నకు ప్రేమతో' 99 డివిజన్ల గెలుపుతో గ్రేటర్ పగ్గాలు టిఆర్ఎస్ కి వచ్చేలా చేసాడు. గ్రేటర్ ఎన్నికలకు దూరంగా కనిపించిన మేనల్లుడు, మంత్రి హరీష్ రావుకు మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ బాధ్యత అప్పగిస్తే , పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డిని తిరుగులేని మెజారిటీతో గెలిపించి, మామకు పుట్టిన రోజు కానుకగా అందించి, ఖుషీ చేసాడు. అది కూడా ఓ రోజు ముందుగా ఇచ్చి , మరింత ఆనందం కల్గించాడు. ఇక గులాబి దళంలో ఆనందానికి అవద్దులేవ్.

నారాయణఖేడ్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయంతో గెలుపు బాటకు అడ్డంకులు లేకుండా పోయాయి. టిఆర్ఎస్ అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డి 53,625 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈనెల 13న నిర్వహించిన పోలింగ్‌లో నియోజకవర్గంలోని మొత్తం 1,88,373 ఓటర్లకు 1,54,866 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డికి 93,076, కాంగ్రెస్‌ అభ్యర్థి సంజీవరెడ్డికి 39,451, టిడిపి అభ్యర్థి విజయపాల్‌రెడ్డికి 14,787 ఓట్లు, శ్రమజీవిపార్టీ అభ్యర్థి భాస్కర్‌కు 5,377, స్వంతంత్ర అభ్యర్థులు సంగారెడ్డికి 509, మాదప్పకు 235, వెంకటేశానికి 291, మురళీ గోవింద్‌కు 333 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఖేడ్‌ ఉప ఎన్నికలో ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్లింది. దీంతో ప్రతిపక్షాలకు అందనంత దూరంలో ఆధిక్యాన్ని కనబరుస్తూ భారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలుపొందింది. ఘన విజయం సాధించడం టి ఆర్ ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ,టీఆర్ఎస్ విజయం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తామిచ్చే కానుక గా అభివర్ణించారు. నారాయణఖేడ్ ప్రజలు సానుభూతి పవనాలను పక్కనబెట్టి అభివృద్ధికే పట్టం కట్టారన్నారు. గొప్ప విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కాగా ఈ ఉప ఎన్నికలో టీడీపీ డిపాజిట్ గల్లంతయ్యింది. టీడీపీ 14787 ఓట్లు దక్కించుకుంది.కాగా సిట్టింగ్ స్థానమైన కాంగ్రెస్ డిపాజిట్ సాధించడంతో కొంత మేరకు పరువు దక్కించుకున్నట్లయింది. ఇక తెలుగుదేశం పార్టీ డిపాజిట్ సైతం కోల్పోయి మూడో స్థానానికి పరిమిత మవ్వడంతో ఆపార్టీ శ్రేణులు నైరాశ్యంలో పడ్డాయి.

ఇక రౌండ్ల వారీగా చూస్తే, ప్రధాన అభ్యర్ధులకు వచ్చిన వివరాలు ఇలా వున్నాయి. మొదటి రౌండ్‌లో టిఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డికి 3,922 ఓట్లురాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి సంజీవరెడ్డికి 1970, టిడిపి అభ్యర్థి విజయపాల్‌రెడ్డికి 701 ఓట్లు లభించాయి. నోటాకు 48 ఓట్లు పోలయ్యాయి.రెండో రౌండ్‌ లో టిఆర్ఎస్ అభ్యర్థికి 3,990, కాంగ్రెస్‌ అభ్యర్థికి 1987, టిడిపి అభ్యర్థికి 832 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 39 ఓట్లు లభించాయి.మూడో రౌండ్‌లో టిఆర్ఎస్ అభ్యర్థికి 4,730, కాంగ్రెస్‌ 1,383, టిడిపి 1,608, నోటాకు 53 ఓట్లు పోలయ్యాయి. నాలుగో రౌండ్‌లో టిఆర్ఎస్ అభ్యర్థికి 4,635, కాంగ్రెస్‌ 2,275, టిడిపి 7112, నోటాకు 26 ఓట్లు పోలయ్యాయి.ఆరో రౌండ్‌లో టిఆర్ఎస్ అభ్యర్థికి 4,024, కాంగ్రెస్‌ అభ్యర్థికి 1,434, టిడిపి అభ్యర్థికి 664, నోటాకు 52 ఓట్లు పోలయ్యాయి.

ఏడో రౌండ్‌లో టిఆర్ఎస్ అభ్యర్థికి 4,529, కాంగ్రెస్‌ అభ్యర్థికి1318, టిడిపి అభ్యర్థికి 1,110, నోటాకు 65 ఓట్లు పోలయ్యాయి.ఎనిమిదోరౌండ్‌ లో టిఆర్ఎస్ అభ్యర్థికి 4,489, కాంగ్రెస్‌ 1823, టిడిపి అభ్యర్థికి 793, నోటాకు 53 ఓట్లు పోలయ్యాయి.తొమ్మిదో రౌండ్‌లో తెరాస అభ్యర్థికి 4,863, కాంగ్రెస్‌ 2,305, టిడిపి అభ్యర్థికి 295, నోటాకు 47 ఓట్లు పోలయ్యాయి.

పదో రౌండ్‌లో టిఆర్ఎస్ అభ్యర్థికి 4,558, కాంగ్రెస్‌ 1777,టిడిపి అభ్యర్థికి 551, నోటాకు 38 ఓట్లు పోలయ్యాయి. 11వ రౌండ్‌లో టిఆర్ఎస్ 5008, కాంగ్రెస్‌ 2,426, టిడిపి అభ్యర్థికి 735, నోటాకు 139 ఓట్లు పోలయ్యాయి.

12వ రౌండ్‌లో టిఆర్ఎస్ 5032, కాంగ్రెస్‌ 1731, టిడిపి 635, నోటాకు 41 ఓట్లు పోలయ్యాయి. 13వ రౌండ్‌లో టిఆర్ఎస్ 5,399, కాంగ్రెస్‌ 2,029 టిడిపి 415, నోటాకు 43 ఓట్లు పోలయ్యాయి.14వ రౌండ్‌లో టిఆర్ఎస్ అభ్యర్థికి 5,669, కాంగ్రెస్‌కు 1,571, టిడిపి అభ్యర్థికి 331, నోటాకు 34 ఓట్లు పోలయ్యాయి.

15వ రౌండ్‌లో టిఆర్ఎస్ 5,129, కాంగ్రెస్‌ 2,085, టిడిపి అభ్యర్థికి 580, నోటాకు 43 ఓట్లు పోలయ్యాయి.

16వ రౌండ్‌: టిఆర్ఎస్ 3,774, కాంగ్రెస్‌ 1381, టిడిపి అభ్యర్థికి 614 ఓట్లు, నోటాకు 27 ఓట్లు పోలయ్యాయి. 17వ రౌండ్‌లో టిఆర్ఎస్ 4,555, కాంగ్రెస్‌ 3,312, తెదేపా అభ్యర్థికి 761 ఓట్లు, నోటాకు 27 ఓట్లు పోలయ్యాయి.18వ రౌండ్‌లో టి ఆర్ ఎస్ 3,374, కాంగ్రెస్‌ 2,223, టిడిపి అభ్యర్థికి 1128ఓట్లు పోలయ్యాయి.19వ రౌండ్‌లో టిఆర్ఎస్ 5,199, కాంగ్రెస్‌ 2079, టిడిపి అభ్యర్థికి 463 ఓట్లు, నోటాకు 38ఓట్లు పోలయ్యాయి. 20వ రౌండ్‌లో టిఆర్ఎస్ 4484, కాంగ్రెస్‌ 1993, టిడిపి అభ్యర్థికి 485, నోటాకు 42 ఓట్లు పోలయ్యాయి.21వ రౌండ్‌లో టిఆర్ఎస్ 1384, కాంగ్రెస్‌ 865 , టిడిపి అభ్యర్థికి 33, నోటాకు 13 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

English summary

After the great victory in Greater Hyderabad Municipal Corporation(GHMC)Elections TRs party won in Narayankhed elections also.Narayankhed poll results have released today, witnessing the TRS candidate Bhupal Reddy’s victory, with as much as 53625 votes majority.