రజనీ పక్కనైతే ఫ్రీగా చేస్తా: త్రిష

Trsiha told that i want to act Rajni Kanth without remmuneration

05:57 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Trsiha told that i want to act Rajni Kanth without remmuneration

సౌత్‌ ఇండియాలో హీరోయిన్‌గా త్రిష దాదాపు పది సంవత్సరాలు పైనే ఒక ఊపు ఊపింది. తెలుగులో స్టార్‌ హీరోలు అయిన ప్రభాస్‌, మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్‌, రవితేజ, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున, చిరంజీవి వంటి హీరోలతో నటించి అగ్ర హీరోయిన్ గా రాజ్యం ఏలింది. తమిళంలో కూడా కమల్‌హాసన్‌, అజిత్‌, సూర్య, విక్రమ్‌, విజయ్‌ వంటి అగ్రహీరోలతో నటించి తన సత్తా చాటుకుంది త్రిష. కానీ ఇంతమంది హీరోలతో నటించిన త్రిషకు మాత్రం ఒక ఆశ నెరవేరలేదట. తనకి ఇష్టమైన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో నటించే అవకాశం రెండు, మూడు సార్లు వచ్చినట్టే వచ్చి చేయిజారిపోయాయి.

అయితే ఇప్పుడు మాత్రం ఎలాగైనా ఒక్కసారి రజనీ సరసన నటించాలని తన మనసులో మాట బయట పెట్టింది త్రిష. రజనీకాంత్‌ ప్రస్తుతం 'కబాలి' లో నటిస్తున్నారు. ఇది అయిపోయాక శంకర్‌ దర్శకత్వంలో రోబో-2 చేయబోతున్నారు, ఇందులో ఇద్దరు కధానాయికల్లొ ఒక నాయికగా అమిజాక్సన్‌ని ఖరారు చేశారు. మరో హీరోయిన్‌ ఎంపిక జరగాల్సి ఉంది, ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించాలని త్రిష తెగ ప్రయత్నిస్తోందట. ప్రస్తుతం త్రిష వయసు 32 ఏళ్ళు ఇంక హీరోయిన్‌గా రిటైరు అయ్యే రోజులు దగ్గర పడుతున్నట్లు మాట.

తను రిటైరయ్యేలోపు రజనీ పక్కన ఒక్కసారి నటించాలని త్రిష భావిస్తోందట. రోబో-2 లో అవకాశమిస్తే తను పారితోషికం కూడా తీసుకోకుండా ఫ్రీగా చేస్తుందట. మరి త్రిష ఇచ్చిన ఆఫర్‌ శంకర్‌కి నచ్చుతుందో లేదో చూడాలి.

English summary

Trsiha told that i want to act Rajni Kanth without remmuneration in Shankar Robo-2.