ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృత్యువాత

Truck Hits with Bus in Chennai Bangalore Highway

06:24 PM ON 3rd June, 2016 By Mirchi Vilas

Truck Hits with Bus in Chennai Bangalore Highway

తమిళనాడులో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కృష్ణగిరి సమీపంలోని మేలుమళై వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, కారు, లారీ అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. మృతుల్లో చిన్నారి సహా ఆరుగురు మహిళలు ఉన్నారు. మృతులను తమిళనాడులోని హోసూరు వాసులుగా గుర్తించారు.

33 ప్రయాణికులతో కృష్ణగిరి వెళ్తున్న ప్రైవేటు బస్సు, కర్ణాటక నుంచి వేరుశనగ లోడుతో వస్తున్న లారీ, మరో కారు మేలుమళ్లై అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. వాహనాలు అతివేగంగా ఢీకొన్నాయి. దీంతో ఈ రెండు వాహనాలు తునాతునకలయ్యాయి. ఈ ఘటనలో మరో 30 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కృష్ణగిరిలోని ప్రభుత్వాసుత్రికి తరలించారు. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి:ఒక్కడినే ప్రేమించిన తల్లీకూతుళ్ళు! ఆ తరువాత ఏమైందో తెలుసా?

ఇది కూడా చూడండి:24 ఏళ్ళ టీచర్ ను గర్భవతి చేసిన 13 ఏళ్ళ స్టూడెంట్!

ఇది కూడా చూడండి:ఇతని వయసు 46.. పిల్లలు 35.. టార్గెట్ 100 మంది(వీడియో)

English summary

Truck Hits with Bus in Chennai Bangalore Highway.