ఫేస్‌బుక్‌కు  దీటుగా...‘ట్రూ ఇండియన్‌’

True Indian which competes with Facebook

05:29 PM ON 29th February, 2016 By Mirchi Vilas

True Indian which competes with Facebook

అవును, సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతున్న  ఫేస్‌బుక్‌కు పోటీగా మరో సోషల్ మీడియా రాబోతోంది. అది కూడా ఇండియాలో ...  ఈ విషయాన్ని  ట్రూఇండియన్‌ సంస్థ వెల్లడించింది. ‘ట్రూ ఇండియన్‌’ పేరుతో ఆవిష్కృతమవుతున్న సోషల్ మీడియా వేదికను బిహార్‌ ఆర్థిక మంత్రి జగ్గంత్‌ మిశ్ర కుమారుడు మనీశ్‌ మిశ్ర నేతృత్వంలోని సాంకేతిక నిపుణులు అభివృద్ధి చేశారు. పెట్టుబడిదారులు వ్యవస్థాపకులకు కేవలం లాభాలు అర్జించి పెట్టేందుకే ఫేస్‌బుక్‌ పనిచేస్తోందట. ట్రూ ఇండియన్‌ను ప్రారంభించనున్న దాతృత్వ సంస్థ ‘ఫ్రెండ్స్‌ ఫర్‌ లైఫ్‌’ ఈ మేరకు ఆరోపించింది. అంతేకాదు, 19వ శతాబ్దంలో దేశాన్ని దోచుకున్న ‘ఈస్ట్‌ ఇండియా కంపెనీ’తో ఫేస్‌బుక్‌ను పోల్చింది. సామాజిక అనుసంధాన వేదిక ‘ఆర్కుట్‌’ను ఫేస్‌బుక్‌ ఏ విధంగా మూలకు నెట్టిందో, తాము కూడా అదేవిధంగా  మరో ఐదేళ్లలో ఫేస్‌బుక్‌ నుంచి ఇండియాకు విముక్తి కల్పిస్తామని ప్రకటించింది. భారత్‌లోని భిన్నత్వం, సమానత్వ భావనలను తమ వేదిక ప్రతిబింబిస్తుందని ట్రూ ఇండియన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే  ‘ట్రూ ఇండియన్‌’ లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట.

ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ అవ్వడానికి క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి

ట్రూ ఇండియన్‌

ట్రూ ఇండియన్ గురించి కొన్ని విషయాలు....

1/4 Pages

భారతీయుల కోసమే

పేస్ బుక్ కు ప్రత్యామ్నాయం గా భారతీయుల కోసం తయారు చేసిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ను  బిహార్‌ ఆర్థిక మంత్రి జగ్గంత్‌ మిశ్ర కుమారుడు మనీశ్‌ మిశ్ర నేతృత్వంలోని సాంకేతిక నిపుణులు అభివృద్ధి చేశారు.

English summary

A new social networking site, which hopes to challenge the dominance of Facebook in India, was launched today. This Site was developed by a team of Indian technocrats led by Manish Mishra, son of Bihar Finance Minister Jagganth Mishra.