సరికొత్తగా ట్రూకాలర్

Truecaller New update

06:35 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Truecaller New update

ట్రూ కాలర్‌.. మనకు పరిచయంలేని వారు.. మనకు తెలియని వారు.. లేదా ప్రమోషనల్ కాల్స్ వంటివి సులువుగా గుర్తించే యాప్ ట్రూకాలర్. అయితే ఈ యాప్‌ గురించి ఫోన్‌ యూజర్లు చాలా మందికి ఎక్కుగా తెలియదు. అందుకే వినియోగదారులకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో ఈ యాప్‌ను సరికొత్త రూపంలోకి తీసుకొచ్చింది ట్రూకాలర్. ఈ ట్రూ డయలర్‌ యాప్‌లో అంతర్గతంగా డయలర్‌ ఉంది. దీనిలో ఫోన్‌ నంబరు లేదా పేరు టైప్‌ చేస్తే ట్రూ కాలర్‌ డేటా బేస్‌లోని సమాచారం ఆధారంగా ఆ వ్యక్తి ఎవరనేది తెలిసిపోతుంది. అదే విధంగా మీరు సెర్చ్‌ చేసిన నంబరు కలిగిన వినియోగదారుడు ట్రూ డయలర్‌ యాప్‌ను వినియోగిస్తున్నట్లయితే వారి స్టేటస్‌ను కూడా మనం తెలుసుకోవచ్చు. అవతలి వ్యక్తి ఫోన్‌ మాట్లాడుతున్నట్లయితే దానికి సంబంధించిన సమాచారాన్ని నూతన యాప్‌ అందిస్తుంది. యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా మోసపూరిత కాల్స్‌, కంపెనీల ప్రచార కాల్స్‌ను సులభంగా గుర్తించవచ్చు. కాల్‌ బ్లాక్‌ ఆప్షన్‌ ద్వారా స్పామ్‌ నంబర్లను బ్లాక్‌ చేయవచ్చు. ఈ కొత్త అండ్రాయిడ్‌ వెర్షన్‌ తాజాగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఐఓఎస్, విండోస్ తదితర ఓఎస్ ల వినియోగదారులకు ఈ వెర్షన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

English summary

Truecaller has introduced several features like smart call history, availability and a new dialer to its app. True caller has started rolling out updates for Android from today.This update will be available for Windows and iOS users.