ట్రంప్ వర్సెస్ హిల్లరీ - విమర్శల జడివాన

Trump and Hillary blaming each other

12:34 PM ON 7th July, 2016 By Mirchi Vilas

Trump and Hillary blaming each other

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విమర్శల జడివాన కురుస్తోంది. తాజాగా ఈ-మెయిల్స్ వివాదంలో క్లీన్ చిట్ లభించిన హిల్లరీ క్లింటన్ అదే ఉత్సాహంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ పై విమర్శల దాడి పెంచేశారు. అట్లాంటిక్ సిటీలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న హిల్లరీ అట్లాంటిక్ సిటీలో ట్రంప్ కంపెనీలకు సంబంధించిన అక్రమాలను ఆమె ఏకరువు పెట్టారు. ట్రంప్ కి చెందిన పలు సంస్థల్లో అక్రమాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగాయని ఆమె ధ్వజమెత్తారు. ఆయనదంతా తప్పుడు వ్యాపార చరిత్రేనంటూ ఎద్దేవా చేశారు. పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని ఎగవేసే ప్రయత్నం చేశారని, కోర్టులు ఆయన కంపెనీలను దివాళాకోరుగా ప్రకటించాయని హిల్లరీ గుర్తుచేశారు.

అమెరికా చట్టాలపై ట్రంప్ కు ఏమాత్రం గౌరవంలేదని ఆమె పేర్కొంటూ, అలాంటి వ్యక్తికి అధ్యక్షుడయ్యే అర్హత లేదన్నారు. న్యూజెర్సీ ఎకానమీకి తిరిగి పట్టాల మీదకు ఎక్కించేందుకు తాము కృషి చేస్తామని సభికుల హర్షధ్వానాల మధ్య ఆమె ప్రకటించారు. కాగా, హిల్లరీ విమర్శలను ట్రంప్ కూడా ఘాటుగానే తిప్పికొట్టారు. అట్లాంటి క్ సిటీలో వ్యాపారాలు నిర్వహించి చాలా డబ్బే సంపాదించా. అయితే ఆ సిటీని వదిలి ఏడేళ్లయింది. ఇన్నేళ్ల తర్వాత, అది కూడా ఎన్నికల సమయంలోనే కంపెనీల దివాలా వ్యవహారంపై మాట్లాడటం ఏమిటి? అంటూ హిల్లరీపై ట్విట్టర్లో మండిపడ్డారు.

హిల్లరీ ఎఫ్బీఐకీ అబద్ధాలు చెప్పి ఈ మెయిల్స్ కేసు నుంచి తప్పించుకున్నారని ఆరోపించారు. హిల్లరీ కచ్చితంగా తప్పుచేసిందని, ఆ నిజాలు ఎప్పటికైనా బయటపడతాయని ఆయన అంటున్నారు. మొత్తానికి విమర్శల జోరు హెచ్చింది.

English summary

Trump and Hillary blaming each other