రికార్డ్ బ్రేక్ చేసిన హిల్లరీ - ట్రంప్

Trump and Hillary creates record

05:23 PM ON 29th September, 2016 By Mirchi Vilas

Trump and Hillary creates record

రికార్డులు బద్దలు కొట్టడం సినిమాల్లోనే కాదు ఎన్నికల్లోనూ ఉంటాయి. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నిక అంటే ఇక చెప్పక్కర్లేదు. పోటీలో వున్న అభ్యర్థులిద్దరూ టీవీ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పారు. ట్రంప్-హిల్లరీల ద్వయం రికార్డులు బద్దలుకొట్టింది. అమెరికా టీవీచరిత్రలో 36ఏళ్ల క్రితం నమోదైన రికార్డును వీరిద్దరి బిగడిబేట్ 98 నిమిషాల్లో బద్దలుకొట్టింది. వీరి కార్యక్రమాన్ని 84మిలియన్ల మంది వీక్షించినట్లు తేలింది. 1980లో జిమ్మీకార్టర్, రొనాల్డ్ రీగన్ ల బిగ్ డిబేట్ ను దాదాపు 80 మిలియన్ల మంది వీక్షించారు. ప్రస్తుతం ట్రంప్-హిల్లరీల బిగ్ డిబేట్ విషయంలో 13ప్రధాన టీవీఛానెల్స్ ను వీక్షించిన వారినే లెక్కలోకి తీసుకున్నారు. వాస్తవానికి వీరి సంఖ్య 84 మిలియన్ల కంటే ఎక్కువగా ఉంటారని అంచనా.

దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్లో చూసినవారు కూడా భారీగానే ఉంటారని భావిస్తున్నారు. వీక్షకులు 98 నిమిషాలపాటు కదలకుండా ఈ ప్రోగ్రాంను చూశారని డేటా ప్రొవైడర్ నీల్సన్ తెలిపింది. ఈ సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు మాట్లాడుతూ టెలివిజన్ చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన కార్యక్రమంగా భావించాం. ట్రంప్ కూడా భారీగా వూపిరి తీసుకొని.. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు వూహించుకొని కార్యక్రమాన్ని కొనసాగించారు అని పేర్కొన్నారు. అక్టోబర్ 9, 19వ తేదీల్లో ట్రంప్-హిల్లరీల మధ్య మరో రెండు భారీ చర్చా కార్యక్రమాలు జరగనునున్నాయి. నవంబర్ 8న ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈలోగా వీరిద్దరి మధ్యా ఆరోపణలు ఎలా ఉండబోతున్నాయో కూడా తేలనుంది.

ఇది కూడా చదవండి: కాజల్ ని వాడుకుని వదిలేసిన స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాకవ్వడం ఖాయం!

ఇది కూడా చదవండి: మీకు ట్విన్స్ పుట్టాలంటే ఇలా చెయ్యండి..

ఇది కూడా చదవండి: మీకు ట్విన్స్ పుట్టాలంటే ఇలా చెయ్యండి..

English summary

Trump and Hillary creates record. Donald Trump and Hillary Clinton creates record in tv history.