ట్రంప్ మళ్ళీ ఏదో కూశాడు

Trump Controversial dialogues

01:13 PM ON 20th June, 2016 By Mirchi Vilas

Trump Controversial dialogues

ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో జాతుల లెక్కలు తీయాల్సిన టైమొచ్చిందని సరికొత్త వివాదానికి తెరతీశారు. ఓర్లాండో ఊచకోత వంటి దురంతాలకు అంతం పలకాలంటే ఇంతకుమించిన తరణోపాయం లేదన్నది తన ఆలోచనగా ఈయన సెలవిచ్చాడు. ఆదివారం ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ విషయం స్పష్టం చేసాడు. ఇజ్రాయెల్ సహా మరికొన్ని దేశాలు ఈ పద్ధతిని విజయవంతంగా అమలు చేస్తున్నాయని తన వాదనకు మద్దతుగా ప్రస్తావించారు. ‘‘ముస్లింలు నివసిస్తున్న ప్రాంతాల్లో తమ చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరు... తెలిసినా వెల్లడించరు. శాన్ బెర్నార్డినో కాల్పులే ఇందుకు నిదర్శనం. అక్కడ 14 మందిని చంపిన దుండగుడి అపార్ట్ మెంట్ లో బాంబులు, ఆయుధాలున్నా ఒక్కరూ ఆ సంగతి చెప్పనందువల్ల నాటి ఊచకోతకు వారూ బాధ్యులే అవుతారు’’ అన్నారు. కాగా, రిపబ్లికన్లు కలిసిరాకపోతే పార్టీ జాతీయ కమిటీకి నిధుల సేకరణను నిలిపేస్తానని, సొంత డబ్బుతో ప్రచారం చేసుకుంటానని ట్రంప్ హెచ్చరించారు. ఎన్నికల్లు అయ్యేలోపు ఇంకా ఎన్ని మాట్లాడి, ఎన్ని గొడవలు తెస్తాడో ఏమో..

ఇది కూడా చూడండి: సెన్సార్‌ బోర్డు రిజెక్ట్‌ చేసిన అడల్ట్‌ సినిమాలు

ఇది కూడా చూడండి: హీరోయిన్లు, వారి సైడ్ బిజినెస్ లు

ఇది కూడా చూడండి: ఇలాంటి అమ్మాయిలని అబ్బాయిలు పెళ్లి చేసుకోరట

English summary

Trump Controversial dialogues.