ట్రంప్ కూతురు సంచలన వ్యాఖ్యలు

Trump Daughter Shocking Comments On Trump

01:45 PM ON 22nd July, 2016 By Mirchi Vilas

Trump Daughter Shocking Comments On Trump

ఇన్నాళ్లూ వివాదాస్పద వ్యాఖ్యలతో దూసుకుపోతూ , ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ ఖరారైన సంగతి తెల్సింది. అయితే ట్రంప్ కి ఆయన కుమార్తె ఎదురు తిరిగినట్లు కనిపిస్తోంది. ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కుమార్తె అయిన ఇవాంక ట్రంప్ ప్రముఖ పారిశ్రామికవేత్తగా, మోడల్గా అమెరికన్లకు సుపరిచితురాలే. ఈమె తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ‘‘మా నాన్న ఉద్యోగుల కోసం పోరాటం చేయడం చూశా. ఇప్పుడు దేశం కోసం పోరాడడం చూస్తున్నా. అధ్యక్షుడిగా గెలిచాక మంచిగా పని చేయకపోతే ఆయనకు నా పోరాటం కూడా చూపిస్తా’’ అంటూ డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ అంటోంది. క్లీవ్ లాండ్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సుకు హాజరయిన ఆమె హాజరైంది. ఈ సందర్బంగా మాట్లాడుతూ, తండ్రి డొనాల్డ్ ట్రంప్ను ఆమె పొగడ్తలతో ముంచేశారు. అమెరికా ప్రజలు ప్రిలిమినరీ ఎన్నికల్లోనే తమ అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారని, అమెరికా అధ్యక్షుడిగా తన తండ్రికి పరోక్షంగా విజయాన్ని ఖరారు చేశార ని అన్నారు. తన తండ్రికి వర్ణ, లింగ వివక్ష బేధాలు లేవని స్పష్టం చేశారు. ఆయన వ్యాపారంలో ఎదిగిన తీరునే, రాజకీయాల్లోనూ కొనసాగిస్తారని, అమెరికా ప్రజలకు నిబద్ధతతో కూడిన పాలన అందిస్తారని ఇవాంక చెప్పారు.

ఇది కూడా చూడండి: కబాలి విషయంలో ఫీలయిపోతున్న జక్కన్న

ఇది కూడా చూడండి: ప్రపంచంలోని అతి పెద్ద 500 కంపెనీల్లో మనవి ఇవే

ఇది కూడా చూడండి: అమ్మాయిలా మజాకా - సోషల్ మీడియా డామినేట్

English summary

Trump Daughter Shocking Comments On Trump.