‘భార్య’ గురించి ట్రంప్ ఎంత మాట అనేసాడు!

Trump shocking comments about his wife

07:19 PM ON 16th June, 2016 By Mirchi Vilas

Trump shocking comments about his wife

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రపం బరిలోకి దిగనున్న ట్రంప్ కి నోటి దురద బాగా ఎక్కువని ఇప్పటికే పలు సార్లు నిరూపితమైంది. అందుకే నోటి తీత ఎక్కువగా ఉండే ట్రంప్ ఎలా మాట్లాడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన తరచూ మీడియాలో ఇంటరాక్షన్ అయ్యాడు. తాజాగా ఆయనకు చెందిన పాత ఇంటర్వ్యూ ఒకటి బయటకు వచ్చింది. 1994లో ఏబీసీ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూభార్యలకు బిజినెస్ పనులు అప్పగించటం ఏమాత్రం మంచిది కాదని అనడమే కాదు, తన వైవాహిక జీవితంలో తన మాజీ భార్య ఇవానాతో ఎందుకు తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చిందన్న విషయాన్ని అందులో ప్రస్తావించడం సంచలనం అయింది.

భార్యలకు పని అప్పగించటం చాలా ప్రమాదకరంగా చెప్పుకొ చ్చిన ట్రంప్ తన మాజీ భార్య ఇవానాకు తన వ్యాపార బాధ్యతలు అప్పగించిన తర్వాతే తమ వైవాహిక బంధం విచ్చిన్నమైందని ఆయన పేర్కొన్నారు. అట్లాంటిక్ సిటీలోని కాసినోస్ లో ఆమెను మేనేజర్ గా నియమించానని.. అప్పటి నుంచి ఆమెలో చాలా మార్పు రావటమే కాదు.. చివరకు విడాకుల వరకూ విషయం వెళ్లిందని ట్రంప్ ఆ ఇంటర్యూలో చెప్పారు. ‘మీ బిజినెస్ లో భార్యకు పని అప్పగించటం చాలా డేంజర్. తెలివితక్కువతనం కూడా. గతంలో ఇలా చేయటం వల్లే ఇవానాతో నా వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చాయి.

బిజినెస్ కు సంబంధించిన కొన్ని విషయాల గురించి ఆమె పెద్ద పెద్దగా మాట్లాడేది. అరిచేది కూడా. ఇవేమీ నాకు నచ్చేవి కావు. భార్యగా ఉన్నప్పుడు ఇవానా చాలా సున్నితంగా వ్యవహరించేది. కానీ.. కంపెనీలో పని అప్పగించిన తర్వాత ఆమెలో సున్నిత స్వభావం మిస్ అయ్యింది’’ అంటూ మొత్తం చిట్టా అంతా విప్పారు. ఇవానా తర్వాత ట్రంప్ మరికొందరిని పెళ్లాడటం తెల్సిందే. అయితే ఇప్పుడు వెలుగు చూసిన ఈ ఇంటర్యూ ట్రంప్ కి డామేజ్ అవుతుందని విశ్లేషకు అంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

English summary

Trump shocking comments about his wife