అమ్మాయిని పడేశా.. దుమారం రేపిన ట్రంప్ మాటలు

Trump shocking statement

04:50 PM ON 15th October, 2016 By Mirchi Vilas

Trump shocking statement

ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యలతో, ఇంకా చెప్పాలంటే, బూతు పురాణం కూడా విప్పుతూ, అందరిచేతా ఛీ కొట్టించుకుంటున్న ట్రంప్ మళ్ళీ మరోసారి వివాదం రేపారు. దీంతో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు రోజురోజుకు కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే హిల్లరీతో జరిగిన డిబేట్లలో వెనకబడిపోయి తీవ్ర నిరాశలో ఉన్న ట్రంప్ ను ఒక్కొక్కటిగా బయటపడుతున్న వీడియోలు మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. గతంలో అమ్మాయిలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల వీడియోలు వెలుగు చూస్తూ తీవ్ర సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ వాహనంలో స్నేహితుతో కలిసి వెళ్తున్న ట్రంప్ ఓ అమ్మాయి గురించి చేసిన వ్యాఖ్యలు మైక్రోఫోన్ లో రికార్డయ్యాయి.

అవి ఇప్పుడు బయటపడడంతో ఆయనకు మరిన్ని తలనొప్పులు వచ్చి పడ్డాయి. స్నేహితులతో వెళ్తున్న ట్రంప్ మాట్లాడుతూ ఓ అమ్మాయితో ఆయన ప్రవర్తించిన తీరును వారికి వివరించారు. ఓ షాపులో వివాహితను లైన్లో పెట్టేశానని, బయటకు కూడా తీసుకెళ్లానని చెప్పిన ట్రంప్ ఆ ప్రయత్నం ఫలించలేదని, వృథా అయిందని చెప్పారు. వివాహిత అందం, శరీర భాగాల గురించి వర్ణించి చెప్పారు. ఆమెను వదిలేసినందుకు తనకు చాలా బాధగా ఉందని చెప్పడంతో స్నేహితులు పకపకా నవ్వారు. మహిళలపై ట్రంప్ కు ఉన్న గౌరవానికి ఈ సంభాషణ ప్రత్యక్ష నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఆయనకు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. నవంబర్ లో జరిగే ఎన్నికల్లో ఈ ఘటనలు ఎటు తిరిగి ఎటు వస్తుందో చూడాలి.

English summary

Trump shocking statement