ఆ రోజు రాత్రి ట్రంప్ కూతురు చేసిన పనిపై అమెరికన్ల మండిపాటు

Trump's daughter costliest dress angers American people

11:57 AM ON 1st February, 2017 By Mirchi Vilas

Trump's daughter costliest dress angers American people

ఎవరి ప్రయివేట్ వాళ్ళది కానీ పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం అని మహాకవి శ్రీ శ్రీ ఎప్పుడో అన్నారు. అందుకే, అత్యున్నత స్థానాలకు చేరుకున్నాక కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాజీవితంలో ఉన్న వారైతే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాజాగా అలాంటి జాగ్రత్తలు తీసుకోని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పైన అమెరికన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ముస్లిం మెజార్టీలున్న ఏడు దేశాల పౌరుల అమెరికా రాకపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికన్లతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

వివాదాస్పద నిర్ణయం తీసుకున్న రోజు రాత్రి ట్రంప్ కుమార్తె ఇవాంకా తన భర్తను తీసుకొని ఒకపార్టీకి వెళ్లిందంట. ఈ పార్టీ కోసం ఆమె ఖరీదైన గౌన్ ధరించటంపై అమెరికన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒకవైపు ఆమె తండ్రి తీసుకున్న నిర్ణయం పుణ్యమా అని అమెరికా వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు.. నిరసనలు వ్యక్తం చేస్తూ వీధుల్లోకి వస్తే.. ఆమె మాత్రం పార్టీకి వెళ్లటం ఏమిటని మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కుమార్తెను.. ఆమె ధరించిన వస్త్రాల్ని తీవ్రస్థాయిలో అమెరికన్లు ఎండగడుతున్నారు.

ఇది కూడా చూడండి: అది మెడా ... బొంగరమా(వీడియో)

ఇది కూడా చూడండి: ఇక నుంచి అంత్యక్రియలు కూడా లైవ్ లో చూడొచ్చు

English summary

Donald Trump daughter Ivanka Trump wore a costliest dress to the party which criticizes American people.