సునామి హెచ్చరికతో తమిళనాడు ఎలర్ట్ 

Tsunami Alert In Chennai

01:45 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Tsunami Alert In Chennai

పాపం ఇప్పటికే వరదలు వానలతొ అతలాకుతలమైన తమిళనాడు కు మరో ముప్పు పొంచి వుందని తాజా హెచ్చరికలు చెబుతున్నాయి. తమిళనాడుకు సునామి ముప్పు ఉందని భారతీయ సముద్ర సమాచార కేంద్రం (నేషనల్ మ్యారీటైమ్ ఇన్ఫర్మేషన్) హెచ్చరించడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. సునామీ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కులచ్చల్ నుంచి రామనాథపురం జిల్లా కీళక్కారై వరకు సముద్ర తీర ప్రాంతాల్లో 8 నుంచి 10 అడుగుల ఎత్తులో అలలు ఉదృతంగా ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరించారు. డిసెంబర్ 28వ తేది అర్దరాత్రి వరకు అలల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఈశాన్య దిశలో గంటకు 44 కి.మీ నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు.

సముద్రంలో చేపల వేటకు ఎవ్వరూ వెళ్లరాదని అధికారుల హెచ్చరికలు ఇప్పటికే జారీచేసారు. సునామీ హెచ్చరికతో అలర్ట్ అయిన ప్రభుత్వం వెంటనే అప్రమత్తం కావాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. కన్యాకుమారి వద్ద సముద్ర నీటి మట్టం పెరిగిందని అధికారులు గుర్తింఛి, వివేకానందస్వామి, తిరువళ్లువర్ విగ్రహాల వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. అక్కడికి రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేశారు కాగా . కన్యాకుమారిలో ఆదివారం ఉదయం నుంచి ఈదురుగాలులు వీస్తున్నాయి. అలల తీవ్రత అధికం అయ్యిందని అధికారులు తెలిపారు మొత్తానికి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమిళనాడు కు సునామి ఏ ముప్పు తెస్తుందో నని భయపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. ఏమవుతుందో చూడాలి.

English summary