ఈ బంతి సునామీల నుంచి కాపాడేస్తుందట 

Tsunami Proof Ball to Save Your Life

12:56 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Tsunami Proof Ball to Save Your Life

తరచూ సునామీలు, భూకంపాలు వంటి విపత్తులు వస్తూనే వున్నాయి. ఇలాంటివి వచ్చినప్పుడు ఒక్కోసారి ఎక్కడ తలదాచుకోవాలో.. ప్రాణాలు రక్షించుకోవడం ఎలాగో తెలియని భయంకర పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే రక్షణ బంతిని బ్రిటన్‌కు చెందిన ఏరోనాటికల్‌ శాస్త్రవేత్త జూలియన్‌ షార్ప్‌ బృందం రూపొందించింది. ఇందులో తలదాచుకుంటే ఎలాంటి విపత్తు నుంచైనా బతికి బయటపడొచ్చని చెబుతున్నారు. సునామీలు, భూకంపాలే కాకుండా హరికేన్‌లు, టోర్నడోలు, తుపానులు, వరదల సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని.. అయిదు రోజుల వరకు ఇందులో ఉండొచ్చని చెబుతున్నారు.


గోళాకారంలో ఉండే దీనిలోకి ప్రవేశించేందుకు ఒక మార్గం ఉంటుంది. బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వీలుగా రెండు దృఢమైన గాజు అద్దాల కిటికీలుంటాయి. ఇది నీటిపై తేలుతుంది కాబట్టి సునామీలు వచ్చినప్పుడు భారీగా నీరు చుట్టుముట్టినా ఇందులో ఉన్నప్పుడు ఎలాంటి భయం ఉండదు. గోళాకారంలో ఉన్నా కూడా దొర్లుతూ వెళ్లకుండా ఉండేలా దీనికి దిగువన ప్రత్యేక ఏర్పాటు ఉంది. 2004లో వచ్చిన ఇండోనేసియా సునామీ అనంతరం ఇలాంటి ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని షార్ప్‌ తలపోశారు. వివిధ దశల్లో అభివృద్ధి చేస్తూ ఇప్పటికి దానికి రూపమిచ్చారు. ఇద్దరు అంతకంటే ఎక్కువమంది పట్టేలా వివిధ పరిమాణాల్లో వీటిని అందుబాటులోకి తెస్తున్నారు.


ఈ బంతిలో సురక్షితంగా కూర్చునేలా సీట్లు ఉంటాయి. అయిదు రోజులకు సరిపడా ఆహారం, ఇతర సామగ్రి ఉంచేందుకు సరిపడా స్థలం ఉంటాయి. తాగునీటి నిల్వ , లోపల సరిపడా వెలుతురు గాలి సరఫరా ట్యాంకులు వుంటాయి. లోనికి నీరు చొరబడని విధమైన ఏర్పాట్లు సరేసరే. జీపీఎస్‌ సౌకర్యం కూడా వుంటుంది.

English summary

Tsunami Proof Ball to Save Your Life. A giant snooker ball, but this spherical capsule could save your life.