సునామీనే కాదు...ప్రపంచాన్ని జయించింది

Tsunami survivor Deborah Herold is world's Top cyclist

01:04 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Tsunami survivor Deborah Herold is world's Top cyclist

ఆ యువతి తొమ్మిదేళ్ళ వయస్సున్నప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన సునామీ ముప్పునుండి ప్రాణాలతో బయటపడి, చావును మోసం చేసింది. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో సైక్లింగ్‌లో నాల్గవ స్థానంలో నిలిచి ప్రపంచవ్యాప్తంగా పలువురి అభిమానాన్ని గెలుచుకుంది. అండమాన్‌ నికోబార్‌కు చెందిన డెబోరా హెరాల్డ్‌ ప్రపంచ సైక్లింగ్‌లో అత్యుత్తమ విజయాలను నమోదు చేస్తూ అందరి చేత శభాష్‌ అనిపించుకుంటోంది. మొదటి నుండి కష్టాలకు ఎదురీదడమే అలవడిన డెబోరా ఎన్నో కష్టనష్టాలకోర్చి ఈ స్థాయికి చేరుకుందని ఆమెను చిన్నప్పటి నుండి తెలిసిన వారు చెబుతారు.

ఆరోజు అండమాన్‌ నికోబార్‌ను సునామీ ముంచెత్తిన రోజు. యావత్‌ ప్రపంచం సముద్రప్రాంతాల్లో సునామీ మిగిల్చిన విధ్వంసం అంతా ఇంతాకాదు. సునామీని డెబోరా కూడా స్వయంగా చూసింది. ఉవ్వెత్తున్న పొంగుకొస్తున్న సముద్రపు అలలకు డెబోరా కుటుంబం మొత్తం చెల్లా చెదురైంది. అదృష్టవశాత్తు డెబోరా చిక్కుకున్న కారు మాత్రం ఒక చెట్టుకు చిక్కుకుపోవడంతో ఆరోజంగా చెట్టుమీదే గడపాల్సి వచ్చింది. అలా సునామీతో చావు అంచుల వరకూ వెళ్ళిన డెబోరా ఇప్పుడు ప్రపంచానికి తన సత్తా ఏమిటో చూపిస్తోంది. 20ఏళ్ళ డెబోరా సైక్లింగ్‌ను ఎంచుకుని ఆ క్రీడలో అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. శుక్రవారం విడుదల అయిన ప్రపంచ సైక్లింగ్‌ కమిటీ రేటింగ్‌లలో మహిళ సైక్లిస్ట్‌గా 4వ స్థానాన్ని సాధించింది. దేశంలోనే ఈ స్థాయి విజయాన్ని నమోదు చేసిన ఏకైక మహిళగా చరిత్రకెక్కింది. గత నెలలో జరిగిన పలు పోటీలలో పాల్గన్న డెబోరా 11కుపై మెడళ్ళను గెలుచ్చుకుని ప్రపంచ స్థాయి 10వ ర్యాంకును నమోదు చేయగా, నెల తిరిగే సరికి ప్రపంచ 4వ ర్యాంకు రావడం నిజంగా విశేషమే.

ఈ స్థాయి విజయాలు అంత సులువుగా రాలేదని డెబోరా చెబుతుంది. ప్రపంచస్థాయి నెంబర్‌ వన్‌ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా కష్టపడుతుందట. వచ్చే ఒలింపిక్స్‌తో భారత్‌కు పతకాలు సాధించేందుకు సిద్ధమైంది ఈ ధీర వనిత.

సునామీని జయించిన తరువాత, క్రీడా రంగంలోకి అడుగుపెట్టాలని కలలు కన్న డెబోరాకు చిన్నప్పటినుండి కూడా లాంగ్‌ జంప్‌ అంటే చాలా ఇష్టం. కానీ విచిత్రమైన పరిస్థితుల్లో లాంగ్‌జంపర్‌ అవ్వాలనుకున్న డెబోరా సైక్లిస్ట్‌గా మారాల్సి వచ్చింది. లాంగ్‌జంప్‌ పోటీల్లో పాల్గనేందుకు తన సైకిల్‌తో నికోబార్‌ నుండి అండమాన్‌ వరకూ చేసిన ప్రయాణమే సైక్లింగ్‌లో తనకున్న పట్టును తెలిసేలా చేసింది. మెరుపువేగంతో సైకిల్‌ను క్రీడాప్రాంగణానికి దౌడు తీయించిన నేర్పు ఎంతో మంది కోచ్‌లను ఆకట్టుకోవడంతో, సదరు కోచ్‌ల సలహా మేరకు డెబోరా సైక్లింగ్‌కు మారింది. ఇక అక్కడ నుండి వెనుదిరిగి చూసే అవకాశమే దక్కలేదు. డెబోరా వచ్చే ఒలింపిక్స్‌లో మరిని పతకాలను ఇండియా ఖాతాలో వేసేందుకు సన్నద్ధమవుతుంది. తన విజయపరంపర సాగించాలని కోరుకుందాం.

English summary

Deborah became the first Indian female cyclist to be ranked fourth in the world.At the Track Asia Cup, her three medals were critical to India finishing third, with 11 medals.When she was 9 years old, she spent a whole day on a tree when tsunami struck the Car Nicobar base