డబ్బులు గుంజిన టిటిఈ పై ట్వీట్ -- రైలు దిగేసరికి సస్పెండ్

TTE Was Suspended By The Tweet Made By Passenger

10:34 AM ON 15th September, 2016 By Mirchi Vilas

TTE Was Suspended By The Tweet Made By Passenger

పిర్యాదు అంటే, ఓరల్ గా , రిటెన్ గానే కాదు, సోషల్ మీడియా ద్వారా కూడా చేస్తే, చర్యలు వుంటాయని రైల్వే శాఖ తేల్చింది. అందుకు తార్కాణమే ఈ ఘటన. ఇంతకీ విషయం ఏమంటే, ఓ రైల్వే ప్రయాణికుడి ట్విట్టర్ ఫిర్యాదుతో టీటీఈ సస్పెండ్ అయ్యాడు. ఈ నెల 10వ తేదీన గోవింద్ నారాయణ్ అనే వ్యక్తి బార్మర్ - కాల్కా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించారు. రిజర్వేషన్ కోచ్ లో సీటు కోసం టీటీఈ శ్యామ్ పాల్ కు రూ.15 చెల్లించారు. అయితే ఆయన రసీదు ఇవ్వలేదు. పలువురు ప్రయాణికుల నుంచి ఇలాగే డబ్బులు వసూలు చేశాడు. ఇది గమనించిన గోవింద్ నారాయణ్ వెంటనే నార్త్ వెస్ట్ జోన్ రైల్వే జీఎమ్ కు ట్విట్ చేశారు. టీటీఈ ప్రయాణికుల నుంచి డబ్బులు ఎక్కువగా వసూలు చేయడంతో పాటు రసీదు ఇవ్వకుండా అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.

ఆయన ప్రయాణిస్తున్న రైలు వివరాలు కూడా ఇవ్వడంతో జీఎం వెంటనే స్పందించారు. ఆ రైలు జోధ్ పూర్ స్టేషన్ చేరగానే విజిలెన్స్ అధికారి టీటీఈ శ్యామ్ పాల్ ను తనిఖీ చేశారు. అతడి వద్ద అదనంగా డబ్బులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ టీటీఈని అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేసినట్లు నార్త్ వెస్ట్ రైల్వే జీఎం రాహుల్ గోయల్ తెలిపారు. శ్యామ్ పాల్ పై తీసుకున్న చర్యలను ఫిర్యాదు చేసిన గోవింద్ నారాయణ్ తో పాటు రైల్వే మంత్రి సురేష్ ప్రభు, ప్రధాని నరేంద్ర మోడీలకు ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే చాలా రైళ్లల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పైగా ప్రజల ప్రోత్సాహంతోనే, ఎలాంటివి జరుగుతున్నాయని కామెంట్స్ పడిపోతున్నాయి.

English summary

One of the passenger named Govind Narayan who was travelling in a train was Tweeted to GM of North West Railway for TTE not given receipt for him while he allotted seat. He complained on this and later in the next station he was checked by the Vigilance officials and he was suspended over there.