తులసి మొక్క ఆకులు రంగు మారితే ప్రమాదమేనట

Tulasi plant tells our future

11:15 AM ON 31st January, 2017 By Mirchi Vilas

Tulasi plant tells our future

ఉదయం లేచాక స్నానం పూర్తయ్యాక పూజ సమయంలో తులసి ప్రాధాన్యత ఎంతో వేరే చెప్పక్కలేదు. తులసి కోట దగ్గర దీపం పెట్టి చుట్టూ తిరగడం మన సంప్రదాయం. ఇక తులసి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఎన్నో వున్నాయి కదా. దీనివల్ల మనం పలు అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఆధ్యాత్మికంగానూ తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని, దాని వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతారు. అయితే ఇంట్లో ఉన్న తులసి చెట్టు అప్పుడప్పుడు పలు కారణాల వల్ల తన సహజ రంగును కోల్పోవడమో, లేదంటే ఉన్నట్టుండి ఆకులు సడెన్గా ఎండిపోవడమో, రాలడమో ఇలా భౌతికంగా అనేక రకాలుగా ఆ చెట్టు మార్పులు చెందుతుందట. దీంతో ఆ ఇంట్లో ఉండే వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇట్టే తెలుసుకోవచ్చట. ఈ క్రమంలో తులసి మొక్క మారే తీరుని బట్టి దాని ఫలితం మారిపోతుందట. అదెలాగో తెలుసుకుందాం.

1. . నిత్యం నీళ్లు పోస్తూ చక్కగా పెంచుతున్న తులసి చెట్టు ఆకులు సడెన్గా ఎండిపోతే దానర్థం ఏమిటంటే… ఆ ఇంటి యజమానికి మరి కొద్ది రోజుల్లో ఆరోగ్యం పరంగా కీడు జరగబోతుందని అర్థం. ఏదైనా పెద్ద అనారోగ్యం బారిన అతను పడే అవకాశం ఉంటుందట.

2. తులసి చెట్టుకు ఒక వేళ నీళ్లు పోయకున్నా బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే అప్పుడు ఆ ఇంట్లో ఉన్నవారందరికీ అదృష్టం కలసి రాబోతుందని అర్థం. భవిష్యత్తులో అలాంటి వారికి సంపద బాగా వస్తుందట.

3. తులసి చెట్టు పచ్చగా ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయట. అలాంటి వారికి ఎలాంటి సమస్యలు రావట.

4. తులసి చెట్టు ఆకులు సడెన్గా వేరే ఏదైనా రంగుకు మారితే దానర్థం ఏమిటంటే… ఆ ఇంట్లో ఉన్నవారిపై ఎవరో తాంత్రిక, క్షుద్ర శక్తులు ప్రయోగించబోతున్నారని అర్థం. అలా ప్రయోగించి వారిని నాశనం చేయాలని చూస్తే అప్పుడు తులసి ఆకులు రంగు మారుతాయట.

5. తులసి చెట్టును ఉంచిన కుండీలో దానంతట అదే మరో తులసి మొక్క పుట్టుకు వస్తే ఆ ఇంట్లో వారికి కెరీర్ పరంగా మంచి జరుగుతుందట. అనుకున్న గోల్స్ సాధిస్తారట.

6. తులసి చెట్టు ఏదైనా కారణాల వల్ల ఎండిపోతే వెంటనే దానికి నీళ్లు పోసి మళ్లీ పచ్చగా ఎదిగే వరకు జాగ్రత్తగా పెంచాలట. అలా చేయకపోతే మంచి జరగదట.

ఇది కూడా చూడండి: వామ్మో ... అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ !?

ఇది కూడా చూడండి: ఇక రాబోయేవి బొద్దింక పాలు?

English summary

Tulasi plant will tells our future by observing their leaves.