టంబ్లర్‌ను బ్యాన్ చేసిన ఇండోనేషియా

Tumbler Banned In Indonesia

04:32 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Tumbler Banned In Indonesia

ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ వెబ్‌సైట్‌ టంబ్లర్‌ను ఇండోనేషియా బ్యాన్ చేసింది. అశ్లీల వీడియోలు, అసభ్యకర చిత్రాలు ఎక్కువగా ఉండటం వల్లే టంబ్లర్ పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇండోనేషియాలో టంబ్లర్‌ సహా 477 వెబ్‌సైట్లపై నిషేధం వేటు పడింది. వీటిపై నిషేధం విధిస్తూ.. ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. మరో రెండు మూడు రోజుల్లో ఆ వెబ్‌సైట్ల యాక్సెస్‌ను పూర్తిగా తొలగించనుంది. చట్టానికి వ్యతిరేకంగా అశ్లీల దృశ్యాలను పోస్టు చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే అసభ్య వీడియోలను పూర్తిగా తొలగించేందుకు సదరు వెబ్‌సైట్ల యాజమాన్యాలు ఒప్పుకొంటే వాటిని తిరిగి అనుమతిస్తామంది. ఈ విషయమై త్వరలోనే యాజమాన్యాలతో చర్చించనున్నట్లు పేర్కొంది.

English summary

Indonesia said on Thursday it will block access to microblogging platform Tumblr over pornographic content, the media reported on Thursday.Along with tumbler 477 online sites being blocked for the same reason in Indonesia.