పాలేరులో దూసుకెళ్లిన కారు - తుమ్మలకు భారీ మెజార్టీ

Tummala Nageswara Rao won with high majority

04:35 PM ON 19th May, 2016 By Mirchi Vilas

Tummala Nageswara Rao won with high majority

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు భారీ విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని సుచరితా రెడ్డి పై 45,676 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పాలేరు ఉప ఎన్నిక పై మొదటి నుంచి తెలంగాణ అధికార పక్షం ఆత్మవిశ్వాసంతో వ్యవహరించింది. దీనికి తగినట్లుగానే తెరాస అభ్యర్థి తుమ్మల భారీ ఆధిక్యంను సొంతం చేసుకోవటం గమనార్హం. తొలి రౌండ్‌ నుంచి తుమ్మల తన ఆధిపత్యాన్ని స్పష్టంగా ప్రదర్శించారు. ఉప ఎన్నికలో 1,71,061 ఓట్లు పోలయ్యాయి. తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు 94,978 ఓట్లు రాగా కాంగ్రెస్‌, తెదేపా, వైకాపా ఉమ్మడి అభ్యర్థిని సుచరితారెడ్డికి 49302 ఓట్లు నమోదయ్యాయి.

కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి అభ్యర్థి పోతినేని సుదర్శన్‌కు 15,544 ఓట్లు లభించాయి. తొలి రౌండ్‌లో 5,426 ఓట్ల ఆధిక్యతతో తన ఖాతాను మొదలుపెట్టిన తుమ్మల రెండో రౌండ్‌ నాటికి పదివేల ఆధిక్యం సాధించారు. నాలుగో రౌండ్‌ ముగిసేసరికి 16,446 ఓట్లు, ఆరో రౌండ్‌ ముగిసేసరికి 20884 ఓట్ల మెజార్టీకి చేరుకున్నారు. 15వ రౌండ్‌ ముగిసేసరికి 41,473 ఓట్లు, 16 రౌండ్‌ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 44050 ఓట్ల ఆధిక్యంలో ఉన్న తుమ్మల... 18వ రౌండ్‌ ముగిసే నాటికి 45,676 ఆధిక్యం సాధించి విజయకేతనం ఎగురవేశారు. దీంతో తుమ్మల విజయం సంపూర్ణమైంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధికి అన్ని పార్టీలు మద్దతిచ్చినా కారు జోరును ఆపలేకపోవడం విశేషం.

English summary

Tummala Nageswara Rao won with high majority